ఐడియా

యాలక్కాయ నోట్లో ఉంటే దుర్వాసన దూరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాలక్కాయ ఆహార పదార్థాలకు సహజసిద్ధమైన సుగంధం, కమ్మదనం ఇవ్వడమే కాదు, యాలకుల్లో ఔషధ గుణాలు కూడా చాలానే ఉన్నాయి.
‘యాలకుల్లో జీర్ణశక్తిని పెంచే గుణం ఎక్కువ. అందువల్ల యాలకులు, సోంపు, ధనియాల మిశ్రమాన్ని భోజనం తరువాత తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
‘ఒక యాలక్కాయని నమిలి చూడండి. వౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను అరికట్టడమే కాకుండా, నోటిలోని బ్యాక్టీరియాను హరింప చేస్తుంది.
‘యాలక్కాయల్లో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడంవల్ల గుండెకు మేలుచేస్తాయి. అందువల్ల ప్రతిరోజూ భోజనంలో యాలకుల్ని చేరిస్తే ప్రయోజనం. యాలకులతో టీ చేసుకుని తాగినా గుండెకు ఎంతో మంచి జరుగుతుంది.
‘యాలకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలూ ఉన్నాయి. అన్నింటికీ మించి కేన్సర్‌ను నిరోధించే మూలకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
రోజూ ఒకట్రెండు యాలక్కాయల్ని నమిలి తినడం ద్వారా వికారం, వాంతులు తగ్గుతాయి.
సూప్స్‌ల్లో యాలక్కాయ వేసుకుంటే, జబులు, ఫ్లూ లక్షణాలు తగ్గుతాయి. *