ఆటాపోటీ

మహిళలకూ ‘యాషెస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల యాషెస్ సిరీస్ శత్రుత్వం కేవలం పురుషుల విభాగానికి మాత్రమే పరిమితం కాలేదు. మహిళల యాషెస్ కూడా అదే స్థాయిలో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. 1934 నుంచి జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. కేవలం టెస్టు మ్యాచ్ లేదా మ్యాచ్‌లను మాత్రమే కాకుండా, వనే్డ, టి-20 సిరీస్‌ల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకొని విజేతను ప్రకటిస్తున్నారు. ఇంత వరకూ ఇరు జట్ల మధ్య 20 సిరీస్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా ఎనిమిది సిరీస్‌లను గెల్చుకుంటే, ఇంగ్లాండ్ ఐదింటిని సొంతం చేసుకుంది. ఏడు సిరీస్‌లు డ్రా అయ్యాయి..

47 మ్యాచ్‌లు!

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ 1882లో జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. కానీ, అంతకంటే ముందు, 1868లోనే ఆస్ట్రేలియాలోని ఆదివాసి జాతులకు చెందిన బృందం ఇంగ్లాండ్ వెళ్లింది. అక్కడ ఏకంగా 47 మ్యాచ్‌లు ఆడింది. 14 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొంది. 19 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇవన్నీ అనధికార మ్యాచ్‌లు కావడంతో రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించలేకపోయాయి. కానీ, ఆస్ట్రేలియా జాతీయ జట్టు కంటే ముందే అక్కడి ఆదివాసీల జట్టు ఇంగ్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడడం అద్భుతం.

ప్రేమ కథ

బెయిల్స్ కాల్చిన బూడిదను ఉంచిన పాత్రతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల ఉన్న శత్రుత్వానికేకాదు.. ఒక ప్రేమ కథకు కూడా విడదీయలేని అనుబంధం ఉంది. 1883లో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకొని స్వదేశానికి చేరిన ఇంగ్లాండ్ జట్టుకు విక్టోరియా మహారాణి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే 3యాషెస్ పాత్రను ఇంగ్లాండ్ కెప్టెన్ ఇవో బ్లిగ్‌కు బహూకరించారు. ఆ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ఫ్లోరెన్స్ మర్ఫీ కూడా ఉంది. ఆమె అందం బ్లిగ్‌ను ఆకట్టుకుంది. సహజంగానే క్రికెటర్లపై ఉన్న ఆకర్షణ ఆమెను కూడా కట్టిపడేసింది. జట్టులోని మిగతా ఆటగాళ్లు ఎవరి ఇళ్లకు వారు వెళ్లినా, ఫ్లోరెన్స్ కోసమే బ్లిగ్ మరికొంత కాలం అక్కడే ఉన్నాడు. రాజమందిరంలోనే వీరి వివాహం జరిగింది. 1927లో బ్లిగ్ చనిపోయిన తర్వాత యాషెస్ సిరీస్ బూడిదను ఉంచిన పాత్రను లార్డ్స్ మైదానంలోని మ్యూజియంలో ప్రదర్శించాలని కోరుతూ అధికారులకు ఫ్లోరెన్స్ అందచేసింది. అప్పటి నుంచి లార్డ్ మ్యూజియంలోనే యాషెస్ పాత్ర పదిలంగా ఉంది. ఈ సిరీస్ విజేత జట్టుకు నమూనా పాత్రను అందచేయడం ఆనవాయితీగా వస్తున్నది.