ఆటాపోటీ

హామిల్టన్ ఔదార్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ఫార్ములా వన్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌ను కేవలం డ్రైవర్‌గానే తెలిసిన చాలా మందికి అతని ఔదార్యం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రేసు కార్లను మెరుపు వేగంతో దూకించే అతను ఇటీవలే పెరూలోని హుయ్నా పిచు పర్వతాన్ని తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి అధిరోహించాడు. వీపుకు ఓ బాలుడ్ని కట్టుకొని మరీ అతను ఈ ఫీట్‌ను పూర్తి చేయడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం క్రమం తప్పకుండా విరాళాలు అందించే హామిల్టన్ చిన్నారుల వికాసానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. తాను గొప్ప రేసర్‌నేకాదు.. గొప్ప మానవతావాదిని కూడా అని నిరూపిస్తున్నాడు.