ఆటాపోటీ

ఎడముఖం.. పెడముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీఫ్ కోచ్ డిడియర్ డెస్‌చాంప్స్‌తో సయోధ్య ప్రసక్తే లేదని, అతనితో ఇకపై చర్చలు జరపబోనని ఫ్రెంచ్ లెజెండరీ ఫుట్‌బాలర్ కరీం బెంజిమా తేల్చిచెప్పాడు. రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బెంజిమా ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై కేసును ఎదుర్కొంటున్నాడు. దీనిని డెస్‌చాంప్స్ తీవ్రంగా పరిగణించి, అతనితో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో బెంజిమాను తీసుకుంటారా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమఖ్య ప్రకటించిన ప్రాబబుల్స్ జాబితాలో అతని పేరు ఉన్నప్పటికీ, వరల్డ్ కప్‌లో ఆడకుండా కోచ్ డెస్‌చాంప్స్ అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవేళ అధికారులు అతనిని తీసుకున్నప్పటికీ, తుది జట్టులో ఆడేంచేదీ లేనిదీ కెప్టెన్, కోచ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తనకు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం ఉండదని అనుమానిస్తున్న బెంజిమా ఎదురుదాడికి దిగాడు. డెస్‌చాంప్స్ ఫ్రెంచ్ జట్టుకు కోచ్‌గా ఉన్నంతకాలం తాను ఆడబోనని ప్రకటించాడు. అతనితో ఇంతకు ముందు ఫోన్‌లో మాట్లాడానని, కానీ, ఎలాంటి ఫలితం లేకపోయిందని బెంజిమా ఆరోపించాడు. తనను నిర్లక్ష్యంగా చూస్తున్న డెస్‌చాంప్స్ మార్గదర్శకంలో ఆడేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశాడు. అతను కోచ్‌గా కొనసాగితే, వచ్చే ఏడాది వరల్డ్ కప్‌లో తాను ఫ్రెంచ్ తరఫున బరిలోకి దిగబోనని ప్రకటించాడు. ఈ నిర్ణయంపై పునరాలోచన ఉండదని చెప్పాడు.