ఆటాపోటీ

అఫ్రిదీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్‌రౌండర్ల జాబితాలో పాకిస్తాన్ ప్రస్తుత కెప్టెన్ షహీద్ అఫ్రిదీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతను 456 పరుగులు సాధించి, 35 వికెట్లు పడగొట్టాడు. 2009 టి-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అతను అసాధారణ ప్రతిభతో జట్టును గెలిపించాడు. లండన్‌లో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఢీకొన్న పాకిస్తాన్ 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. అఫ్రిదీ 40 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి, జట్టుకు టి-20 వరల్డ్ కప్‌ను అందించాడు. పాక్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించడంలో అఫ్రిదీ కీలక పాత్ర పోషించాడు.
అత్యధిక సున్నాలు
టి-20 వరల్డ్ కప్‌లో సున్నాకే ఎక్కువ పర్యాయాలు అవుటైన ఆటగాళ్ల జాబితాలో షహీద్ అఫ్రిదీ (పాకిస్తాన్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) మొదటి స్థానాన్ని పంచుకుంటున్నారు. వీరిద్దరూ చెరి ఐదు పర్యాయాలు డకౌటయ్యారు. సనత్ జయసూర్య (శ్రీలంక), కామెరూన్ రైట్ (ఆస్ట్రేలియా) చెరి నాలుగుసార్లు సున్నాకే వెనుదిరిగి రెండో స్థానంలో ఉన్నారు. ఫ్లెచర్, సిమన్స్, డారెన్ బ్రేవో, కమ్రాన్ అక్మల్ తలా మూడుసార్లు డకౌటయ్యారు.

వికెట్ల హీరో
లసిత్ మలింగ
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ టి-20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. అతను మొత్తం 38 వికెట్లు సాధించాడు. వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా క్రికెట్‌కు దూరమైన పాకిస్తాన్ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ 36, శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్, పాక్ ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ తలా 35 చొప్పున వికెట్లు కూల్చారు.

- సత్య