ఆటాపోటీ

నిజమెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయు కాలుష్యంతో ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నామని శ్రీలంక క్రికెటర్లు గగ్గోలు పెట్టడంలో వాస్తవం ఉందా? లేక టీమిండియాను సమర్థంగా ఎదుర్కొలేక వారు ఢిల్లీలో వాయు కాలుష్య సమస్యను అడ్డం పెట్టుకొని విమర్శల నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాలుష్యం భరించలేనంత స్థాయిలో ఉంటే, లంక వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా ఎందుకు మాస్క్ ధరించలేదన్నది ఈ ప్రశ్నలకు ప్రధాన కారణం. చివరి టెస్టులో జరిగిన నాలుగు రోజుల ఆటలో డిక్‌విల్లా ఏ సందర్భంలోనూ మాస్క్ ధరించలేదు. అంతేకాదు.. ఫీల్డ్ అంపైర్లు నిగెల్ లాంగ్, జోల్ విల్సన్ కూడా వాయు కాలుష్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వారు కూడా మాస్క్‌లు వేసుకోకుండానే మైదానంలో ఉంటున్నారు. దేశ పరువు పోగొట్టుకోవద్దన్న ఉద్దేశంతోనే భారత క్రికెటర్లు మాస్క్‌లు ధరించరాదని నిర్ణయించుకున్నారని అనుకున్నా, డిక్‌విల్లా, ఫీల్డ్ అంపైర్లు ఎందుకు మాస్క్‌లు లేకుండానే వస్తున్నారన్నది ప్రశ్న. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందనే విషయం వాస్తవమేగానీ, శ్రీలంక క్రికెటర్లు హడావుడి చేస్తున్నంత స్థాయిలో లేదనడానికి ఈ అంశానే్న పలువురు పేర్కొంటున్నారు. అదీ నిజమేనేమో!