ఆటాపోటీ

ఇదో నమ్మకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడా రంగంలో వ్యక్తులకే కాదు.. జట్లకూ కొన్ని నమ్మకాలు ఉంటాయని బెల్జియం హాకీ జట్టు నిరూపించింది. ఆ జట్టు ఆటగాళ్లు వింతగా ప్రవర్తించారని కొంత మంది విమర్శిస్తున్నప్పటికీ, ఇలాంటి నమ్మకాలు క్రీడల్లో సహజమేనని చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే, వాళ్లు వాళ్లు చేసిన పని హోటల్ మేనేజ్‌మెంట్‌కు, అధికారులకు ముచ్చెమటలు పోయించింది. వివరాల్లోకి వెళితే, ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్‌లో బెల్జియం మూడో స్థానంలో ఉన్న బెల్జియం ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో ఎవరూ ఊహించని రీతిలో భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఓడిన రోజు అర్ధ రాత్రే స్టేడియానికి వెళ్లి, గోల్‌పోస్టును కొద్దిసేపు తదేకంగా చూస్తే, తర్వాతి మ్యాచ్‌లో గెలుస్తామన్నది బెల్జియం జట్టు నమ్మకం. అందుకే, క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన రోజు అర్ధ రాత్రి వారు ఎవరికీ చెప్పకుండా తమ హోటల్ నుంచి స్టేడియానికి బయలుదేరారు. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకు నల్ల రంగు పూసుకున్నారు. అనుకున్న విధంగానే అందరి కళ్లుగప్పి స్టేడియానికి చేరుకున్నప్పటికీ, అక్కడ వారికి భద్రతా సిబ్బంది నుంచి సమస్య ఎదురైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేడియంలోకి అనుమతించేది లేదని తెగేసి చెప్పిన భద్రతా సిబ్బంది, అంతటితో ఆగకుండా పోలీసులకు సమాచారమిచ్చారు. ఎవరో ఆగంతకులు స్టేడియంలో చొక్కుకెళ్లేందుకు ప్రయత్నించారన్న అనుమానంతో హడావుడిగా చేరుకున్న పోలీసులకు బెల్జియం హాకీ ఆటగాళ్లు ఇచ్చిన వివరణతో తలతిరగిపోయింది. ‘ఇదేం నమ్మకం?’ అంటూ లోలోపల చిరాకుపడినా, స్టేడియంలోకి వెళ్లేందుకు నిబంధనలు అంగీకరించవని నచ్చచెప్పి, వారిని జాగ్రత్తగా హోటల్‌కు చేర్చారు. మొత్తానికి ఈ సంఘటన హోటల్ సిబ్బందిని ఇరుకున పడేసింది. అంతర్జాతీయ క్రీడాకారులు బస చేసినప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలావుంటారంటూ ఉన్నతాధికారులు తిడుతుంటే, ఏమని సమాధానం చెప్పాలో తెలియక అక్కడి సిబ్బంది తల వంచుకోవాల్సి వచ్చింది. అయితే, హాకీ ఇండియా (హెచ్‌ఐ)గానీ, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)గానీ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించకపోవడంతో, హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇలావుంటే, వారి ప్రయత్నం ఫలించిందో లేక పోరాటం జయించిందో తెలియదుగానీ, ఐదో స్థానం కోసం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 1-0 తేడాతో గెలిచింది.