ఆటాపోటీ

మనసున్న మనిషి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ ఫుట్‌బాలర్ జెర్మెయిన్ డెఫో పేరు ఇటీవల జరిగిన బీబీసీ ప్రకటించిన స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ జాబితాలో కనిపించకపోవడం చాలామందికి ఆగ్రహం తెప్పించింది. అలాంటి మనసున్న మనిషికి అవార్డును ఇవ్వని బీబీసీ అధికారులపై బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి కోపానికి కారణం లేకపోలేదు. అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకిన ఆరేళ్ల బ్రాడ్లే లొవెరీ తనకు వీరాభిమాని అని తెలిసిన వెంటనే ఆ చిన్నారిని కలిశాడు డెఫో. తీరిక లేని షెడ్యూల్ ఉన్నప్పటికీ, దొరికిన ప్రతి క్షణాన్ని అతనికి కేటాయించాడు. మృత్యువుతో పోరాడుతూ జూన్ మాసంలో లొవెరీ మృతి చెందడం డెఫోను తీవ్రంగా కలచివేసింది. ఆ వార్త విన్న తర్వాత మ్యాచ్ ఆడుతూ, లొవెరీని తలచుకుంటూ అతను పదేపదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొత్తం మీద ఈ ఉదంతాన్ని తెలుసుకున్న బీబీసీ లొవెరీకి మరణాంతరం స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. తనకే అవార్డు వచ్చినంతగా పొంగిపోయాడు.