ఆటాపోటీ

అతనొక్కడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండా, కెరీర్‌లో తొలి శతకాన్ని టెస్టు మ్యాచ్‌లో సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ పాండ్య రికార్డు నెలకొల్పాడు. గతంలో విజయ్ మంజ్రేకర్, కపిల్ దేవ్, అజయ్ రత్రా, హర్భజన్ సింగ్ కూడా ఇదే విధంగా ఫస్ట్‌క్లాస్ శతకాన్ని మొదట టెస్టు మ్యాచ్‌లోనే చేశారు. గాలేలో జరిగిన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన హార్దిక్ ఆ మ్యాచ్‌లో 50 పరుగులు చేశాడు. ఈ టెస్టులో 108 పరుగులు సాధించాడు. కెరీర్‌లో తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని అతను 96 బంతుల్లోనే చేయడం విశేషం. ఈ స్కోరులో ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఒక టెస్టులో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేగాక, భోజన విరామ సమయానికి ముందే అతను సెంచరీ పూర్త చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో లంచ్ విరామంలోపే శతకాన్ని నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్‌గా మరో రికార్డు సృష్టించాడు.

- సత్య