ఆటాపోటీ

మేటి ఆల్‌రౌండర్ అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు, 275 వికెట్లు పూర్తి చేసిన ఆటగాడిగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రిచర్డ్ హాడ్లీ ఈ ఘనతను అందుకోవడానికి 58 టెస్టులు అవసరంకాగా, అశ్విన్ కేవలం 51 మ్యాచ్‌ల్లోనే పూర్తిచేసి, రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అంతకు ముందు, హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో అతను షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం వికెట్లు కూల్చి, ఈ ఫార్మాట్‌లో 250 వికెట్ల మైలురాయిని చేరాడు. అతను 45 టెస్టుల్లోనే ఈ ఘనతను అందుకొని, 1981లో ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీ 48 టెస్టులతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అంతేగాక, అత్యంత వేగంగా 25 పర్యాయాలు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా అశ్విన్ పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. అతను 47 టెస్టుల్లోనే ఈ ఫీట్‌ను నమోదు చేయగా, అంతకు ముందు నంబర్ వన్ స్థానంలో ఉన్న రిచర్డ్ హాడ్లీకి 62 టెస్టులు అవసరమయ్యాయి.