ఆటాపోటీ

విల్లీస్ వివాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఫాస్ట్ బౌలర్లు సాధ్యమైనంత వరకూ బంతిని పాతపడకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలోనే ఉమ్మిని లేదా చెమటను దానికి పూస్తూ, ప్యాంట్ లేదా షర్టుకు బలంగా రుద్దుతుంటారు. అయితే, బంతిని మరింత మెరిపించడానికి, వేగంగా దూసుకెళ్లేలా చేయడానికి ఇంగ్లాండ్ పేసర్ బాబ్ విల్లీస్ ఓ కొత్త పద్ధతి కనిపెట్టాడు. వేజ్‌లైన్‌ను నుదుటికి పూసుకొని మైదానంలోకి వచ్చిన అతను, చెమటతో బంతిని తుడుస్తున్నట్టు నటిస్తూ, వేజ్‌లైన్‌ను బంతికి పూసేవాడు. అతని ట్రిక్కు ఎంతోకాలం పని చేయలేదు. అనుమానంతో బ్యాట్స్‌మెన్ అప్పీల్ చేయడంతో, ఒకసారి అంపైర్లు బంతిని పరీక్షించి, దానికి వేజ్‌లైన్ ఉన్నదని నిర్ధారించారు. వివాదాస్పద బౌలర్‌గా విల్లీస్ చరిత్రలో నిలిచిపోయాడు. బాల్ ట్యాంపరింగ్ గురించి ప్రపంచానికి బాగా తెలిసింది అప్పుడే.

- సత్య