ఆటాపోటీ

వెయిట్‌లిఫ్టింగ్‌కు గొప్ప ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో మంది మేటి లిఫ్టర్లు డోప్ పరీక్షలో పట్టుబడి పరువు పోగొట్టుకున్న నేపథ్యంలో, ఈ ఏడాది గొప్ప ఊతాన్నిచ్చింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో చారిత్రక విజయాన్ని సాధించిన మీరాబాయి చాను డోప్ దోషి కాకపోవడం మన దేశంలో వెయిట్‌లిఫ్టింగ్‌కు శుభసూచకంగా పేర్కోవాలి. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఈ ఏడాది వెల్లడించిన డోప్ ఫలితాల్లో, అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 117 మంది భారతీయులు డోప్ పరీక్షల్లో పట్టుబడగా, వారిలో 54 మంది వెయిట్‌లిఫ్టర్లే కావడం గమనార్హం. అందుకే, మీరాబాయి స్వర్ణ పతకం సాధించిన వార్త తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ డోప్ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూశారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరెక్కడా ఉండదు. 25 రోజుల వ్యవధిలో అటు వాడా, ఇటు జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) ఆమెకు 45 పరీక్షలు జరిపాయి. అన్నింటిలోనూ ఆమె దోషి కాదని స్పష్టం కావడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. భారత వెయిట్‌లిఫ్టింగ్ చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మీరాబాయి యావత్ లిఫ్టర్లకు మార్గదర్శకురాలైంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల మీరాబాయి సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించింది. అమెరికాలోని అనాహెమ్‌లో జరిగిన ఆ చాంపియన్‌షిప్స్‌లో మీరాబాయి మహిళల 48 కిలోల విభాగంలో పోటీపడి, విజేతగా నిలవడంతోపాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి 1994, 1995 సంవత్సరాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలను అందుకుంది. 22 ఏళ్ల తర్వాత మీరాబాయి ఆ ఘనతను అందుకుంది. భారత్‌లోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఎక్కువ మంది డోప్ దోషులున్నది వెయిట్‌లిఫ్టింగ్‌లోనే కావడం గమనార్హం. ఈ క్రీడలో పాల్గొనే వారికి అపారమైన శక్తిసామర్థ్యాలు ఉండాలి. అందుకే, ఎక్కడ పరువు పోగొట్టుకుంటామోనన్న భయంతో చాలా మంది లిఫ్టర్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడడం ఒక అలవాటుగా మారింది. డోప్ పరీక్షలో దోషులుగా పట్టుబడితే శిక్ష అనుభవించక తప్పదని తెలిసినప్పటికీ, మాదక ద్రవ్యాల వాడకం ఒక వ్యసనమైంది. మన దేశంలో డోప్ కేసులు ఇదివరకు లెక్కకుమించి నమోదయ్యాయి. అందుకే, ఒకానొక దశలో భారత వెయిట్‌లిఫ్టింగ్ సంఘం గుర్తింపును అంతర్జాతీయ లిఫ్టింగ్ సమాఖ్య రద్దు చేసింది. అతి కష్టం మీద ఆ సమస్య నుంచి బయటపడినప్పటికీ, ఎప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందోనన్న భయం అందరినీ వెంటాడింది. అందుకు తగ్గట్టుగానే డోప్ దోషుల్లో మరోసారి లిఫ్టర్లే అగ్రస్థానాన్ని ఆక్రమించారు. అయితే, ఉత్ప్రేరకాలు వాడకపోయినా ఉన్నత శిఖరాలను అధిరోహించడం, అద్భుత ఫలితాలు సాధించడం అసాధ్యమేమీ కాదని మీరాబాయి నిరూపించింది. విజయాలకు దగ్గరి మార్గాలను ఎంచుకునే బదులు, నిజాతీయగా శ్రమించి, లక్ష్యాలను చేరడానికి ఏకాగ్రతతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమేనంటున్న మీరాబాయి అడుగుజాడల్లో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉంది. ఆమెతోనే మన దేశంలో వెయిట్‌లిఫ్టింగ్‌కు కొత్త ఊతం వచ్చింది. ఈ వారసత్వాన్ని మిగతావారు ముందుకు తీసుకెళ్లాలి.
ఇతర టోర్నీలను పరిశీలిస్తే, భారత్‌కు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు దక్కాయి. మేజర్ ఈవెంట్స్‌లో పతకాలు సాధిస్తారనున్న వారు నిరాశ పరిస్తే, యూత్ విభాగంలో కొందరు అద్భుత ప్రతిభ కనబరచి, అత్యుత్తమ భవిష్యత్తు తమకు ఉందని నిరూపించారు. కతార్‌లోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ అండ్ ఓషియానా వెయిట్‌లిఫ్టింగ్ సీనియర్స్, జూనియర్స్, యూత్ విభాగాల్లో టీం చాంపియప్స్‌లో స్వర్ణ పతకాలతోపాటు, ఓవరాల్ చాంపియన్ టైటిళ్లను కూడా భారత్ గెల్చుకుంది.