ఆటాపోటీ

ప్రేక్షకుల నిరాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌లో రెండేసిసార్లు చాంపియన్లుగా నిలిచిన ఉక్రెయిన్ హీరో వసిల్ లొమచెన్కొ, క్యూబా వీరుడు గులెర్మో రిండిక్స్ మధ్య బాక్సింగ్ పోరుపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. హోరాహోరీ పోరు జరుగుతుందన్న నమ్మకంతో న్యూయార్క్‌లో స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ఇద్దరు బాక్సర్లు రింగ్‌లోకి అడుగుపెట్టడంతోనే ఆ ప్రాంతమంతా చప్పట్లు, నినాదాలతో మారుమోగింది. కానీ, కొన్ని నిమిషాల్లోనే వారిలో ఉత్సాహం సన్నగిలింది. లొమచెన్కొ పంచ్‌లను ఎదుర్కోలేకపోయిన రిండిక్స్ ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయాడు. ఒక బలమైన పంచ్‌ని అడ్డుకునే ప్రయత్నంలో అతని చేతి మణికట్టు విరిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫైట్‌ను నిలిపేస్తున్నట్టు రిఫరీ ప్రకటించాడు. మొత్తం మీద ఉత్కంఠ రేపుతుందనుకున్న ఫైట్ నీరసంగా సాగడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. రిండిక్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- సత్య