ఆటాపోటీ

హాజర్డ్ నిజాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరోపియన్ ఫుట్‌బాల్ అంటేనే ఘర్షణలకు మారుపేరు. ఒక జట్టుతో మరో జట్టుకే కాదు.. ఒకే జట్టులోనూ ఒకరితో ఒకరికి పడదు. గిల్లికజ్జాలు, విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిపోతుంది. కానీ, చెల్సియా ఆటగాడు ఎడెన్ హాజర్డ్ ఎంతో నిజాయితీగా వ్యవహరించి, తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. హడెర్స్‌ఫీల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా 3-1 తేడాతో గెలిచింది. విలియన్, పెడ్రో, తిమో బకాయోకో తలా ఒక గోల్ చేశారు. కానీ, మ్యాచ్‌లో అత్యంత కీలకంగా వ్యవహరించి, హడెర్స్‌ఫీల్డ్‌ను గోల్స్ చేయకుండా నిలువరించిన ఎడెన్ హాజర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ తర్వాత జరిగిన ఒక టీవీ షోలో విలియన్‌తోపాటు ఎడెన్ హాజర్డ్ కూడా పాల్గొన్నాడు. తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విలియన్‌కు అందించి, నిజానికి దానిని తీసుకునే అర్హత తనకు లేదని వ్యాఖ్యానించాడు. ఒక ఆటగాడు నిజాయితీగా మరో ఆటగాడిని ప్రశంసించడం యూరోపియన్ సాకర్‌లో అరుదుకాబట్టి, ఎడెన్ హాజర్డ్ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.