ఆటాపోటీ

ఒలింపిక్స్ కోసం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింటర్ ఒలింపిక్స్ కోసం ఏటా ఫిబ్రవరి మాసంలో జరగాల్సిన సైనిక విన్యాసాలను వాయిదా వేసుకోవాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. చాలాకాలంగా అమెరికాతో కలిసి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో సంయుక్త మిలటరీ రొటీన్‌ను నిర్వహించడం దక్షిణ కొరియాకు ఆనవాయితీగా వస్తున్నది. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 25వ తేదీ వరకు పయాంగ్‌చాంగ్‌లో వింటర్ ఒలింపిక్స్, మార్చి 9 నుంచి వింటర్ పారాలింపిక్స్‌కు దక్షిణ కొరియా ఆతిథ్యమిస్తుంది. అత్యంత ఉద్రిక్తంగా మారిన ఉత్తర కొరియా సరిహద్దుకు పయాంగ్‌చాంగ్ కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్న కారణంగా, సైనిక విన్యాసాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని దక్షిణ కొరియా భావిస్తున్నది. అంతేగాక, వింటర్ ఒలింపిక్స్, వింటర్ పారాలింపిక్స్ నిర్వాహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, వాటిపై దృష్టి కేంద్రీకరించక తప్పడం లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయే ఇన్ అంటున్నాడు. అందుకే, అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. అయితే, వీటిని ఎప్పుడు నిర్వహించేదీ ఆయన స్పష్టం చేయలేదు.