ఆటాపోటీ

బిసిసిఐ వింత నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న వింత నిర్ణయం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా దేశవాళీ పోటీల్లో ఎస్‌జి బంతులను వాడుతున్నారు. కపిల్ దేవ్, కర్నస్ ఘావ్రీ, మదన్‌లాల్, బల్వీందర్ సింగ్ సంధు, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, బాపూ నాద్కర్ణి, అనిల్ కుంబ్లే వంటి మేటి బౌలర్లు క్రికెట్ ప్రపంచానికి ఇక్కడి నుంచే లభించారు. సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్, నారీ కాంట్రాక్టర్, లాలా అమర్‌నాథ్, మొహీందర్ అమర్‌నాథ్, అంశుమాన్ గైక్వాడ్, చేతన్ చౌహాన్, విరాట్ కోహ్లీ వంటి మేటి బ్యాట్స్‌మెన్ కూడా ఎస్‌జి బంతులతో ఆడిన వారే. అయితే, ఎస్‌జి బంతుల స్థానంలోనే కూకబొరా బంతులను ప్రవేశపెట్టాలని బిసిసిఐ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఎస్‌జి బంతి సుమారు 600 రూపాయలకు లభిస్తే, కూకబూర బంతికి 2,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఇంత భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే దేశవాళీ పోటీల్లోనూ కూకబొరా బంతులను వాడాల్సిందేనని బిసిసిఐ వాదిస్తున్నది. మరి మన దేశంలో క్రికెట్ మొదలైన నాటి నుంచి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు లేరా? అత్యుత్తమ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ మన దేశంలో కరవయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం బిసిసిఐ వద్ద కూడా లేదు.
రంగుల్లో తేడాలు
రంగు ఏదైతేనే బంతుల నాణ్యతా ప్రమాణాలు మెరుగ్గా ఉంటే చాలన్నది చాలా మంది అభిప్రాయం. కానీ, రంగుల్లో తేడాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నది వాస్తవ ముఖచిత్రం. సంప్రదాయక ఎర్ర బంతులను వదిలి తెలుపు, గులాబీ రంగుల్లో బంతులు వచ్చాయి. కానీ, టెస్టుల్లో ఎర్ర బంతినే ఇప్పటికీ వాడుతున్నారు. కానీ, ఇటీవలే ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లను గులాబీ బంతులతో ఆడించే ప్రయోగం చేశారు. వీటి వల్ల ఆటగాళ్లకు లాభమా? నష్టమా? అన్నది పక్కకు ఉంచితే, కెమెరామెన్ నానా ఇబ్బందులు పడుతున్నారట. బ్యాట్స్‌మన్ బలంగా షాట్ కొట్టినప్పుడు బంతి ఎక్కడ ఉందో గుర్తించడం కష్టమవుతున్నదని కెమెరామెన్ వాపోతున్నారు. అంతేకాదు.. బంతి మురికిపట్టి, విచిత్రమైన రంగులోకి మారిపోతున్నది. ఎర్ర బంతులకు ఇలాంటి సమస్యలు లేవు. అందుకే, గులాబీ బంతుల విప్లవం ఎంతోకాలం సాగే అవకాశాలు కనిపించడం లేదు. టెస్టుల్లో ఎస్‌జి, డ్యూక్, కూకబొరా బంతులను వాడుతున్నారు. మన దేశంలో ఎస్‌జి బంతుల వాడకం ఎక్కువగా ఉంది. ఇంగ్లాండ్‌లో డ్యూక్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లో కూకబొరా బంతులకు ప్రాధాన్యమిస్తున్నారు. టెస్టుల్లో ఎర్ర బంతుల వాడకమే కొనసాగుతున్నది. వనే్డల్లో తెల్ల బంతుల వాడకం పెరిగింది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ ఫార్మెట్‌లో కూకబొరా బంతులనే ఉపయోగిస్తున్నారు.