ఆటాపోటీ

రొట్టెతిన్న విశ్వాసం (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుక్కలు విశ్వాసానికి మారుపేరని మరోసారి రుజువు చేసిన సంఘటన ఇది. 2014లో స్వీడన్‌కు చెందిన నలుగురు సభ్యులతో కూడిన ట్రెక్కింగ్ బృందం అడ్వెంచర్ రేసింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. పోటీ ఆరంభమైన కొద్దిసేపటి తర్వాత, సేద తీరేందుకు ఒకచోట కూర్చున్నప్పుడు వీధి కుక్క ఒకటి ఆకలితో తమవైపే చూడడాన్ని ట్రెకర్లు గమనించారు. జాలిపడి, రొట్టె ముక్కలను దానికి వేశారు. తిండి పెట్టి, ఆకలి తీర్చారన్న విశ్వాసంతో ఆ కుక్క 430 కిలోమీటర్ల రేసు పూర్తయ్యే వరకూ వారినే అనుసరించింది. వారితో కలిసే గుట్టలను, తుప్పలను, కొండలను దాటింది. జట్టులోని ఓ సభ్యుడు మిఖయిల్ లిండార్డ్ ఆ కుక్కకు ఆర్థర్ అని పేరుపెట్టి, పెంచుకోవడానికి తనతో తీసుకెళ్లాడు. రొట్టె ముక్క తిన్నందుకు ఇన్ని కష్టాలను అనుభవించిన ఆర్థర్‌ను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.