ఆటాపోటీ

ఇదో ఆట.. (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొడ్డలిని ఎందుకు ఉపయోగిస్తారు? కట్టెలు కొట్టడానికి అంటూ ఎవరైనా ఈ ప్రశ్నకు సులభంగా సమాధానమిస్తారు. కానీ, కెనడాలోని నోవా స్కాటియా ప్రాంతానికి వెళితే, ఆర్చరీ మాదిరి కొత్త ఆట ఆడేందుకని జవాబు చెప్తారు. హాలీఫాక్స్‌లోని ఒక కట్టెల దుకాణాన్ని నడుపుతున్న డారెన్ హడ్సన్‌కు వచ్చిన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కొత్త క్రీడా ‘యాక్స్ త్రోయింగ్’. ఆర్చరీలో మాదిరిగానే ఒక లక్ష్యాన్ని సిద్ధం చేసి, దానిని గురి చేసి పదునైన గొడ్డలిని విసరడమే ఈ ఆట. ఒక రకంగా చెప్పాలంటే, గొడ్డలితో ఆడే ఆర్చరీ ఇది. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్న ‘యాక్స్ త్రోయింగ్’, పెడదారులు పడుతున్నది. కొంతమంది రెండు చేతులతో గొడ్డళ్లను విసిరితే, మరి కొంతమంది అత్యంత ప్రమాదకరంగా, లక్ష్యాల వద్ద మనుషులను నిలబెడుతున్నారు.

- సత్య