ఆటాపోటీ

సూపర్ బౌలర్ ఇంజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారా వంటి మేటి బ్యాట్స్‌మెన్‌తో పోల్చగల ప్రతిభావంతుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. అతను గొప్ప బౌలరేమీ కాడు. 378 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడితే, కేవలం 58 బంతులు మాత్రమే వేశాడు. 64 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, బౌలింగ్‌లో ఎవరూ ఇంతవరకూ సాధించలేకపోయిన అరుదైన రికార్డును సొంతం చేసుకొని, సూపర్ బౌలర్ అనిపించుకున్నాడు. వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో తాను వేసిన మొదటి బంతికే వికెట్ సాధించడమే అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 1991 నవంబర్ 24న వెస్టిండీస్‌తో ఫైసలాబాద్‌లోని ఇక్బాల్ స్టేడియంలో వనే్డ ఆడుతున్నప్పుడు అతను కెరీర్‌లో తొలి ఓవర్ వేశాడు. మొదటి బంతికే విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారాను ఔట్ చేశాడు. రెగ్యులర్ బౌలర్ కాకపోవడంతో, ఇంజీ బంతిని అర్థం చేసుకోలేక, వికెట్ కీపర్ మోయిన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి లారా వెనుదిరిగాడు. వనే్డల్లో వేసిన తొలి బంతికే వికెట్‌ను సాధించిన బౌలర్‌గా ఇంజీ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.