ఆటాపోటీ

మంచులోనే మ్యాచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బు ముందు ఏవీ పని చేయవు. అమెరికా జాతీయ ఫుట్‌బాల్ (రగ్బీ) లీగ్ మ్యాచ్‌లను అభిమానులు విరగబడి చూస్తారు కాబట్టి, దాదాపు ఏడాది పొడవునా మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. అయితే, న్యూయార్క్‌లో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో, బఫెలో బిల్స్, ఇండియానా పొలిస్ కోల్ట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడుతుందని అంతా ఊహించారు. కానీ, అధికారులు మాత్రం మ్యాచ్‌ని రద్దు చేయడానికిగానీ, వాయిదా వేయడానికి వీల్లేదని పట్టుబట్టారు. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే, అప్పటికే అమ్ముడైన టికెట్ల డబ్బును తిరిగి చెల్లించాల్సి వస్తుందని వారి భయం. అందుకే, వాతావరణ పరిస్థితులు ఎలావున్నా, మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తేల్చిచెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆటగాళ్లు మంచులోనే మ్యాచ్ ఆడారు. బఫెలొ బిల్స్ 13-7 తేడాతో గెలిచింది. నిర్వాహకుల తీరుతో మండిపోయిన కొంతమంది ప్రేక్షకులు ఎముకలు కొరికే చలిలోనూ షర్టులు విప్పేసి మరీ మ్యాచ్‌ని చూశారు. అధికారుల వైఖరికి నిరసన చెప్పడానికి ఇదో పద్ధతేమో!