ఆటాపోటీ

కాకతాళీయమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో భారత జట్టు టెస్టు మ్యాచ్‌ని గెల్చుకున్న రెండు సంఘటనల మధ్య సారూప్యం కాకతాళీయమేనా? లేక చాలా మంది క్రికెటర్లు నమ్ముతున్నట్టు బలమైన కారణం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా లభించదు. విషయానికి వస్తే, 1983లో లండన్‌లోని లార్డ్స్ మైదానంలో భారత జట్టు కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. సరిగ్గా మూడేళ్ల తర్వాత, అంటే 1986లో భారత్ మొట్టమొదటిసారి లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు మ్యాచ్‌ని గెలిచింది. ఆ మైదానంలో టీమిండియాకు రెండో టెస్టు విజయం 2014లో లభించింది. అంతకు మూడు సంవత్సరాల క్రితం, 2011లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ వరల్డ్ కప్‌ను సాధించింది. లార్డ్స్‌లో టెస్టు విజయానికీ, వరల్డ్ కప్‌కూ ఉన్న సంబంధం ఏమిటో?