ఆటాపోటీ

ఎన్నో జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు బంతులను తయారు చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి తయారీకి వాడే జంతు చర్మం నాణ్యత నుంచి ‘సీమ్’గా పిలిచే కుట్ల వరకూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. బరువు నుంచి ఫినిషింగ్ దాకా ప్రతి దశలోనూ వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలి. మృదువుగా ఉంటే పరుగుల వరద పారదు. మరీ దృఢంగా ఉంటే బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంది. షాట్ కొట్టాలంటే బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు కనిపిస్తాయి. అందుకే మధ్యేమార్గంగా బాల్స్‌ను తయారు చేస్తారు. బెరడు చిన్నచిన్న ముక్కలుగా కోసి, వాటిని ఒక దగ్గర చేర్చి కుట్లు వేస్తారు. దాని చుట్టూ గట్టిదారాన్ని గట్టిగా చుడతారు. దానిపైన రెండు లేదా నాలుగు భాగాలుగల వౌల్డ్ చేసిన చర్మం ముక్కలను అతికించి మళ్లీ కుట్లు వేస్తారు. ఎన్ని ముక్కలు ఉన్నప్పటికీ, రెండు అర్ధ భాగాలను కలిపి వేసే కుట్లు మాత్రమే బయటకు కనిపిస్తాయి. వీటినే ‘సీమ్’ అని కూడా పిలుస్తారు. బంతి వేగం నుంచి దిశను మార్చుకోవడం వరకూ ప్రతి కదలికలోనూ కుట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయ. బ్యాట్స్‌మెన్ కొట్టే బలమైషాట్లకు తెగిపోకుండా ఉండేలా నాణ్యమైన గట్టిదారంతో కుట్లు వేస్తారు. మిగతా అన్ని దశల్లోనూ యంత్రాలను వాడుతున్నప్పటికీ, సీమ్ విషయానికి వస్తే ఇప్పటికీ సంప్రదాయ విధానాలనే పాటిస్తున్నారు. కుట్లను చేత్తోనే వేస్తున్నారు. కార్క్ ఎంపిక నుంచి కుట్ల వరకూ అడుగడుగునా ప్రత్యేక శ్రద్ధ అవసరం. నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం తగ్గినా అవి మ్యాచ్‌లకు పనికిరావు. ఓవర్లు బౌల్ అవుతున్న కొద్దీ బంతి పాతపడుతుంది. మెరుపు వేగంతో బౌల్ చేసే పేసర్లకు బంతిని స్వింగ్ చేయడం కష్టమవుతుంది. అందుకే, ఫీల్డర్లు బంతి తీసుకున్న ప్రతిసారీ దానిని ఒకవైపు రుద్దుతూ మెరిపించే ప్రయత్నం చేస్తారు. మెరుపు ఉన్న వైపు నేలకు తగిలేలా వేసిన బంతి వేగంగా దూసుకెళుతుంది. కొంచెం గరుగ్గా ఉన్న రెండో అర్ధ భాగం నేలకు తగిలితే, బంతి స్వింగ్ అవుతుంది. బ్యాట్స్‌మెన్ ఆట తీరును బట్టి, ముఖ్యంగా ఫుట్‌వర్క్‌ను గమనిస్తూ బౌలర్లు బంతులు వేస్తారు. టెస్టు మ్యాచ్‌ల్లో ప్రతి 80 ఓవర్ల తర్వాత ఒక కొత్త బంతిని తీసుకునే అవకాశం కెప్టెన్లకు ఉంటుంది. బంతి మెరుస్తూ, సీమ్ ఉన్నంత వరకూ ఫాస్ట్ బౌలర్లు బౌల్ చేయడం, బంతి పాతపడిన తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగడం ఆనవాయితీ. బంతి ఎంత పాతబడితే, స్పిన్నర్లకు అంత బాగా గ్రిప్ దొరుకుతుంది. పట్టు బాగా కుదిరితే, బంతిని అద్భుతంగా స్పిన్ చేయవచ్చు. అయితే, ఒక్కోసారి ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టి, స్పిన్నర్లతో బౌలింగ్‌ను మొదలుపెట్టించిన కెప్టెన్లు లేకపోలేదు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇదే విధంగా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో తొలి ఓవర్లు వేయించాడు. బౌలర్లు గొప్పగా బౌల్ చేస్తున్నారా లేక భారీగా పరుగులిస్తున్నారా అన్నది వారి ప్రతిభ మీదేకాదు.. బంతులు తయారు చేసిన విధానంపైన కూడా ఆధారపడుతుంది.