ఆటాపోటీ

అదరగొట్టిన ఫాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతూ శతకాలు సాధించినవారు లేకపోలేదు. అయితే, మొదటి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డు రెగినాల్డ్ ‘టిప్’ ఫాస్టర్‌కే సొంతం. 1878లో జన్మించిన అతను తన ఆరుగురు సోదరులతో కలిసి కౌంటీ క్రికెట్ ఆడాడు. వర్సెస్టర్‌షైర్ క్లబ్‌లో ఏకంగా ఏడుగురు ‘్ఫస్టర్లు‘ ఉన్నందుకు అప్పట్లో ఆ జట్టును ‘్ఫస్టర్‌షైర్’ అని పిలిచేవారు. 1903లో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన అతను ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 285 పరుగులు చేస్తే, ఫాస్టర్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇంగ్లాండ్ 73 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అలాంటి క్లిస్టమైన సమయంలో క్రీజ్‌లో నిలదొక్కున్న ఫాస్టర్ 287 పరుగులు సాధించాడు. టెస్టు కెరీర్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇప్పటివరకూ అన్ని పరుగులు మరే ఇతర క్రికెట్ సాధించలేదు. జాక్వెస్ రుడాల్ఫ్ (సౌతాఫ్రికా) 2003లో బంగ్లాదేశ్‌పై తన తొలి టెస్టు ఆడుతూ 222 పరుగులు చేశాడు. కానీ, ఫాస్టర్ రికార్డును అందుకోలేకపోయాడు.