ఆటాపోటీ

ఎందుకలా? (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వికెట్ సాధించిన వెంటనే తనదైన శైలిలో, పక్షి రెక్కలు చాచి గాలిలో ఫీట్లు చేస్తున్నట్టు పరుగులు తీస్తాడు. వికెట్ లభించినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, అందరిలోకీ అక్తర్‌ది భిన్నమైన విధానం. అతను ఎందుకలా పరిగెడతాడన్నది చాలాకాలం రహస్యంగానే ఉంది. ఇటీవలే ట్విటర్‌లో అతను వివరణ ఇచ్చిన తర్వాత.. ఇదా సంగతి అనుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే... అక్తర్‌కు యుద్ధ విమానాలంటే చాలా ఇష్టం. యుద్ధాల్లో పాల్గొనే జెట్ విమానానికి పైలట్ కావాలని అనుకున్నాడు. కానీ, క్రికెటరయ్యాడు. అయితే, ఆ కోరికను చంపుకోలేక, క్రికెట్ మైదానానే్న ఆకాశంగా ఊహించుకొని, జెట్ విమానంలాగా విన్యాసాలు చేసేవాడు.

- సత్య