ఆటాపోటీ

చెక్కుచెదరని రికార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ క్రీడలోనైనా రికార్డులు ఉన్నది బద్దలు కావడానికే అని అంటారు. అది నిజం కూడా. క్రికెట్‌లో రికార్డులు తరచు మారుతూనే ఉన్నాయి. కానీ, కొన్ని దశాబ్దాలుగా చెక్కుచెదరని రికార్డులు కూడా ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే అలాంటి రికార్డుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ చార్లెస్ బనెర్మన్ చేసిన రికార్డును మొదటగా ప్రస్తావించాలి. 1877 మార్చి 15న ఇంగ్లాండ్‌తో మొదలైన టెస్టులో బనెర్మన్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. టెస్టు క్రికెట్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాట్స్‌మన్‌గా అతను చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అదే మ్యాచ్‌లో ఆసీస్ సాధించిన 245 పరుగుల్లో బనెర్మన్ ఒక్కడే 165 పరుగులు చేశాడు. అంటే, మొత్తం స్కోరులో 67.34 శాతం పరుగులు అతనివే. ఇంత వరకూ 2,279 టెస్టు మ్యాచ్‌లు జరిగినా, ఆ రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. ఆస్ట్రేలియాకే చెందిన మైఖేల్ స్లాటర్ 1999లో ఇంగ్లాండ్‌పై సిడ్నీ మైదానంలో 123 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 186 పరుగులకే ఆలౌటైంది. స్లాటర్ సాధించిన పరుగుల శాతం 66.84. అతను బనెర్మన్ రికార్డుకు చేరువైనప్పటికీ, దానిని బద్దలు చేయలేకపోయాడు.
పదో స్థానంలో..
ఏ టెస్టులోనైనా మొదట టాప్ ఆర్డర్‌ను దెబ్బతీస్తే, మిడిల్ ఆర్డర్ భరతం పట్టడం ఏమంత కష్టం కాదు. ఇక టెయిల్ ఎండర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానికి, తిరిగి మైదానం నుంచి పెవిలియన్‌కు వాకింగ్ చేస్తున్న రీతిలో వారు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లిపోతారు. ఇది సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ, పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పటికీ, క్రీజ్‌లో పాతుకుపోయి ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా లేకపోలేదు. అలాంటి వారిలో వాల్టర్ రీడ్ పేరును తప్పక ప్రస్తావించుకోవాలి. 1884లో ఇంగ్లాండ్‌తో ‘ది ఓవల్’ మైదానంలో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 551 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఒక దశలో 181 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చివరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన వాల్టర్ రీడ్‌ను త్వరగానే అవుట్ చేయవచ్చన్న ఆస్ట్రేలియా అంచనాలు తారుమారయ్యాయి. ఓపెనర్‌గా వచ్చి, అప్పటివరకూ నాటౌట్‌గా ఉన్న విలియమ్ స్కాటన్‌తో కలిసి వాల్టర్ రీడ్ పదో వికెట్‌కు 151 పరుగులు జోడించాడు. తాను వ్యక్తిగతంగా 117 పరుగులు చేసి అవుటయ్యాడు. చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అతను సృష్టించిన రికార్డును నేటికీ ఎవరూ బద్దలు చేయలేకపోయారు. బంగ్లాదేశ్ తరఫున కెరీర్‌లో తొలి మ్యాచ్‌ని 2011లో వెస్టిండీస్‌పై ఆడిన అబుల్ హసన్ 113 పరుగులు చేశాడు. వాల్టర్ రీడ్ రికార్డును అధిగమించే అవకాశాన్ని కేవలం ఐదు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మొత్తం మీద 1884 నుంచి వాల్టర్ రీడ్ రికార్డు కొనసాగుతునే ఉంది.
సూపర్ బౌలర్
జార్జి లోమన్‌ను సూపర్ బౌలర్‌గా పేర్కోవాలి. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ 1896లో దక్షిణాఫ్రికాతో జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో 28 పరుగులకే తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. 1956లో ఇంగ్లండ్‌కే చెందిన జిమ్ లేకర్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కూల్చి, ఆ రికార్డును అధిగమించాడు. అయితే, కెరీర్‌లో 18 టెస్టులు ఆడి, 112 వికెట్లు పడగొట్టాడు. సగటున అతను ప్రతి 34.1 బంతులకు ఒక వికెట్ చొప్పున తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో కనీసం 2000 బంతులు వేయడాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, అతి తక్కువ స్ట్రయిక్ రేట్ ఇప్పటికీ అదే కావడం విశేషం.