ఆటాపోటీ

వజ్రాల బంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలు బంతులేకాదు.. వజ్రాలు పొదిగిన బంతులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ సీజస్ ఆరంభాన్ని పురస్కరించుకొని, 2004లో వజ్రాలతో బంతిని తయారు చేయించారు. శ్రీలంకలోని అల్‌స్టోన్ కొచ్ సంస్థ దీనిని 53.83 క్యారెట్ల బరువుతూగే 2,704 వజ్రాలతో రూపొందించింది. ఈ వజ్రాలను 125 గ్రాముల నాణ్యమైన బంగారంతో ఒక దగ్గరికి చేర్చి, బంతి ఆకారంలో తీర్చిదిద్దారు. అప్పట్లోనే ఆ బంతి ఖరీదు 68,000 డాలర్లు (సుమారు45,71,000 రూపాయలు). తర్వాత కాలంలో వజ్రాల బంతులు చాలానే వచ్చాయి. అన్నిటి కంటే ఖరీదైన బంతిని గీతాంజలి జెమ్స్ కంపెనీ తయారు చేసింది. 2,728 వజ్రాలు పొదిగిన దీని ఖరీదు 68,500 డాలర్లు (సుమారు 46.5 లక్షల రూపాయలు). కానీ, ఈ బంతులు చూసి మురిసిపోవడానికే తప్ప ఆడడానికి పనికిరావుకదా అని చాలామంది పెదవి విరుస్తున్నారు.