ఆటాపోటీ

రేసుల వీరుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహ్లీకి కార్లంటే ఇష్టం. వాటిని వేగంగా పరుగులు తీయించడం మరీ ఇష్టం. మైఖేల్ జాక్సన్ స్మృత్యర్థం ప్రదర్శించిన ఒక సినిమా ప్రివ్యూను చూసేందుకు కోహ్లీ ఒక కారులో, ధోనీ, సురేష్ రైనా మరో కారులో బయలుదేరారు. ఎవరు ముందు అక్కడి చేరుకుంటారన్నది చూద్దామంటూ పందేలు వేసుకున్నారు. కానీ, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కోహ్లీ అనుకున్న సమయానికి థియేటర్‌కు చేరలేకపోయాడు. కానీ, వేగంగా కారు నడపడంలో అతనికి ఉన్న ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతున్నది.
కోహ్లీ మొదట్లో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ అంటే ఇష్టపడ్డాడు. కానీ, ఆమె తనను పట్టించుకోకపోవడంతో దృష్టిని క్రికెట్‌పై కేంద్రీకరించాడు. తర్వాత మరో బాలీవుడ్ నటి అనుష్క శర్మతో అతని ప్రేమాయణం సాగింది. ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్కను పదేపదే విమర్శిస్తున్నారని, ప్రతి చిన్న విషయానికీ ఆమెను మధ్యలోకి లాగుతున్నారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుష్క తన ఆత్మవిశ్వాన్ని పెంచిందని, ఆమెకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లోకి ఆమె పేరును చేర్చడం దుర్మార్గమని వాపోయాడు. ఆమెను విమర్శించడం మానుకోవాలని హితవు పలికాడు. తమ మధ్య విభేదాలు లేవని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.