ఆటాపోటీ

ముద్దు పేరు ‘చిక్కూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరాట్ కోహ్లీ ముద్దు పేరు ‘చిక్కూ’. ఢిల్లీ కోచ్ అజిత్ చౌదరీ పెట్టిన పేరు అది. కోహ్లీ ఒకసారి తలకు నూనె పట్టించి ప్రాక్టీస్‌కు హాజరయ్యాడు. ఎండకు నూనె కరిగి అతని మొహమంతా జిడ్డుగా మారింది. ఆ సమయంలో అతను హిందీ కామిక్ పుస్తకం ‘చంపక్’లో వచ్చే సీనియల్ కథలోని క్యారెక్టర్ ‘చిక్కూ’ మాదిరి కనిపించడంతో చౌదరీ అతనిని అదే పేరుతో సంబోధించాడు. కోహ్లీ టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతనిని కెప్టెన్ ధోనీ ‘చిక్కూ’ అని పిలవడం స్టంప్‌లోని మైక్రోఫోన్ ద్వారా మ్యాచ్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికీ వినిపించింది. చౌదరీ కూడా కోహ్లీని ధోనీ ‘చిక్కూ’ అని పిలవడం విన్నాడు. ఆరోజు సాయంత్రం కోహ్లీకి ఫోన్ చేసి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ‘మీ చిక్కూ ఇప్పుడు టీమిండియా మొత్తానికి చిక్కూ అయ్యాడు’ అని కోహ్లీ సమాధానమిచ్చాడు. మొత్తం మీద క్రికెట్ సర్కిల్స్‌తోపాటు అతనికి అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన ‘చిక్కూ’ పేరు ఇప్పుడు అభిమానులందరికీ తెలిసిపోయింది.

టాటూల వీరుడు

ఢిల్లీ జట్టులో స్థానం సంపాదించిన అత్యంత పిన్న వయస్కుడిగా కోహ్లీ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. అతను 14 ఏళ్ల వయసులోనే ఢిల్లీ ఫస్ట్ డివిజన్ జట్టుకు ఎంపికయ్యాడు. 16వ ఏట చేతిపై పచ్చబొట్లతో ప్రత్యక్షమైన కోహ్లీని చూసి చౌదరీ నివ్వెరపోయాడు. టాటూస్ ఎందుకు వేయించుకున్నావంటూ ఆగ్రహించాడు. అయితే, శిఖర్ ధావన్, కెవిన్ పీటర్సన్ తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ, తాను పచ్చబొట్టు పొడిపించుకుంటే తప్పేముందని ప్రశ్నించాడు. కోహ్లీ సమాధానంగా చౌదరీ కోపంతో ఊగిపోయాడు. క్రికెట్ ఆడడానికి వస్తున్నావే తప్ప ఫ్యాషన్ షోకు కాదన్నాడు. మార్నాడు జరిగే విజయ్ మర్చెంట్ ట్రోపీ మ్యాచ్‌లో బాగా ఆడాలని, లేకపోతే, పచ్చబొట్లు కనిపించకుండా ఎప్పుడూ పొడుగు చేతులున్న టీషర్టులే వేసుకోవాలని షరతు విధించాడు. కోచ్ ఆగ్రహించాడన్న కోపమో లేక పచ్చబొట్లపై ఉన్న మమకారమో తెలీదుగానీ ఆ మ్యాచ్‌లో కోహ్లీ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అతను మొత్తం నాలుగు టాటూలు వేయించుకున్నాడు. వాటిలో సమురాయ్ టాటూ అంటే అతనికి ఎంతో ఇష్టం. దానివల్లే తనను అదృష్టం వరించిందని కోహ్లీ నమ్మకం.
chitram..
అండర్-19 వరల్డ్ కప్‌తో కోహ్లీ