ఆటాపోటీ

దుఃఖాన్ని దిగమింగి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజీల్లోకి కోహ్లీ 2006లో, తన 19వ ఏట అడుగుపెట్టాడు. కర్నాటకను ఢీకొన్న ఆ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడిన కోహ్లీ కొండంత విషాదాన్ని తనలోనే దాచుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగించడం అందరినీ కలచివేసింది. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 446 పరుగుల భారీ స్కోరు సాధిస్తే, అందుకు సమాధానంగా ఢిల్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. స్కోరుబోర్డు ముందుకు కదలకుండానే శిఖర్ ధావన్ కూడా అవుట్‌కావడంతో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. పునీత్ బిస్త్‌తో కలిసి ఆ రోజు ఆట ముగిసే సమయానికి మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడిన కోహ్లీ 40 పరుగులు సాధించాడు. మర్నాటి ఉదయం తనపై పెద్ద భారం ఉందన్న విషయం అతనికి తెలుసు. కర్నాటక బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎలా భారీ ఇన్నింగ్స్‌ను ఆడాలి? అని తనను తాను ప్రశ్నించుకుంటూ నిద్రలోకి జారాడు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో అతనికి ఫోన్ వచ్చింది. తండ్రి ప్రేమ్ కోహ్లీ మృతి చెందాడన్న చేదు వార్త అతనికి తెలిసింది. తెల్లవారే సరికి ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ కోహ్లీని ఓదార్చారు. అతను ఇంటికి వెళతాడని అనుకున్న జట్టు మేనేజ్‌మెంట్ తర్వాతి బ్యాట్స్‌మన్ చైతన్య నందాను బ్యాటింగ్‌కు దిగాల్సిందిగా ఆదేశించింది. కానీ, ఆట మొదలయ్యే సమయానికి కోహ్లీ ప్యాడ్స్ కట్టుకొని, గ్లోవ్స్ వేసుకొని, బ్యాట్‌తో ప్రత్యక్షం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. తండ్రి మృతి చెందిన దుఃఖాన్ని మనసులోనే దాచుకున్న కోహ్లీ ఆ ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేశాడు. అతను అవుటయ్యే సమయానికి ఢిల్లీ 211 పరుగుల స్కోరు చేయగలిగింది. ఫాలోఆలోన్‌ను తప్పించుకోవడానికి కేవలం 36 పరుగుల దూరంలో నిలిచింది. అవుటైన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన కోహ్లీ అక్కడ ఉన్న టీవీలో తాను అవుటైన విధానాన్ని రీప్లేలో చూస్తూ కొన్ని క్షణాలు గడిపాడు. ఆతర్వాతే అతను తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఆట పట్ల ఉన్న అంకిత భావానికి, జట్టు ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధతకు ఈ సంఘటన ఒక నిదర్శనం.