ఆటాపోటీ

తొలి విజేత రాజస్థాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొట్టమొదటి ఐపిఎల్ ఫైనల్ చివరి క్షణం వరకూ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. 2008 జూన్ ఒకటో తేదీన జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీ కొన్నాయి. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. పార్థీవ్ పటేల్ 38, సురేష్ రైనా 43, మహేంద్ర సింగ్ ధోనీ 29 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, రాజస్థాన్ బౌలర్ యూసుఫ్ పఠాన్ 22 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. సొహైల్ తన్వీర్, షేన్ వాట్సన్‌కు చెరొక వికెట్ లభించింది. అనంతరం రాజస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరడం ద్వారా, మూడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి తొలి ఐపిఎల్‌ను సొంతం చేసుకుంది. చివరి బంతి వరకూ ఈ మ్యాచ్ కొనసాగడం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. యూసుఫ్ పఠాన్ 56, స్వప్నిల్ అస్నోడ్కర్ 28 పరుగులు చేసి, రాజస్థాన్‌ను రేస్‌లో ఉంచారు. చివరి ఓవర్‌లో విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. లక్ష్మీపతి బాలాజీ వేసిన ఆ ఓవర్‌లో ఐదు బంతుల్లో ఏడు పరుగులు లభించగా స్కోరు సమమైంది. చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన స్థితిలో సొహైల్ తన్వీర్ లాంగ్ లెగ్ మీదుగా షాట్ కొట్టి రెండు పరుగులు సాధించాడు. రాజస్థాన్ తొలి ఐపిఎల్ ట్రోఫీని స్వీకరించింది. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచిన యూసుఫ్ పఠాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.