ఆటాపోటీ

డిఫెండింగ్ చాంప్ ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది హాట్ ఫేవరిట్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్ కైవసం చేసుకుంది. చారిత్రక కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మే 24న జరిగిన ఫైనల్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. లెండల్ సిమన్స్ 45 బంతుల్లో 68, రోహిత్ శర్మ 26 బంతుల్లో 50, కీరన్ పోలార్డ్ 18 బంతుల్లో 38, అంబటి రాయుడు 24 బంతుల్లో 36 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో డ్వెయిన్ బ్రేవో 36 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మ, పవన్ నేగీ, డ్వెయిన్ స్మిత్ తలా ఒక వికెట్ కూల్చారు.
విజేతగా నిలిచేందుకు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం చెన్నైకి కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో పటిష్టంగా ఉన్న ఆ జట్టు సులభంగానే గెలుస్తుందని అంతా భావించారు. కానీ, డ్వెయిన్ స్మిత్ (48 బంతుల్లో 57 పరుగులు) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలం కావడంతో చెన్నై 20 ఓవర్లలోవ 8 వికెట్లు చేజార్చుకొని 161 పరుగులకు పరిమితమైంది. సురేష్ రైనా 28, ధోనీ 18 చొప్పున పరుగులు చేశారు. చివరిలో మోహిత్ శర్మ (7 బంతుల్లో 21 పరుగులు), రవీంద్ర జడేజా (8 బంతుల్లో 11 పరుగులు) అజేయంగా నిలిచినప్పటికీ, చెన్నైని గెలిపించలేకపోయారు.