ఆటాపోటీ

పోటెత్తే ప్రేక్షకులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మక్కువ ఉంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లను తిలకించడానికి ప్రేక్షకులు పొటెత్తుతారు. ఎండ తీవ్రత లేకపోతే ఆస్ట్రేలియా ఓపెన్ మరింత ఆసక్తికరంగా ఉండేది. కానీ, ఈ టోర్నీ జరిగే సమయంలో అక్కడ ఎండలు మండిపోతుంటాయ. అందుకే, ఆస్ట్రేలియా ఓపెన్ చాలా మంది మేటి క్రీడాకారులను కూడా భయపెడుతున్నది. టోర్నీకి వేదికైన మెల్బోర్న్‌లో వేడిని భరించడం సామాన్యమైన విషయం కాదు. ఇక అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి శీతల దేశాల నుంచి టోర్నీలో పాల్గొనేవారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. గత ఏడాది మెల్బోర్న్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ ఉషోణ్రగతతో మెల్బోర్న్ అగ్ని గుండంలా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు.
1905లో టోర్నమెంట్ మొదలైంది. తొలి ఏడాది పోటీలకు ఎంత వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయనా, మరుసటి సంవత్సరంలోనే ఉక్కబోత సమస్య అటు పోటీదారులకు, ఇటు ప్రేక్షకులకు తెలిసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడం అసాధ్యం కాబట్టి, ఆటగాళ్లు ఎండ బారిన పడకుండా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. అవి సత్ఫలితాలనిస్తున్న దాఖలాలు లేవు. అగ్ని గుండాన్ని తలపించే మెల్బోర్న్‌లో మ్యాచ్‌లు ఆడడం సాధ్యంగా లేదని చాలా మంది వాపోతున్నారు. ఏ క్రీడలోనైనా చెమటోడ్చడం అంటే కష్టపడడం. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం ఈ మాటకు మెల్బోర్న్ ఉక్కబోతను భరించడమనే అర్థం వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిర్వాహకులు గడ ఏడాది హీట్ పాలసీని అమలు చేశారు. గతంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరే వరకూ వేచిచూసేవారు. ఉషోణ్రగత ఆ స్థాయకి చేరుకునే సమయంలో కొనసాగుతున్న సెట్ పూర్తయ్యే వరకూ వేచి ఉండేవారు.
సెట్‌ను ముగిసిన తర్వాతే స్టేడియం పైకప్పును మూసేసి ఆటను కొనసాగించేవారు. కానీ, గత ఏడాది కొత్త హీట్ పాలసీని అమలు చేశారు. దాని ప్రకారం ప్రకారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరిన మరుక్షణమే ఆటను నిలిపేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, క్షణాల్లో మూసుకునే పైకప్పును ఏర్పాటు చేశారు. పరిస్థితి తీవ్రత పెరిగితే, అత్యవసర సమయాల్లో ఉపయోగించే విధంగా 363 మిలియన్ డాలర్ల ఖర్చుతో మరో స్టేడియం రూఫ్‌ను ఆధునీకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పైకప్పు కేవలం ఐదు నిమిషాల్లో మూసుకుపోతుంది. మండే ఎండల నుంచి ఆటగాళ్లను, ప్రేక్షకులను రక్షించేందుకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, మండే ఎండలతో మల్బోర్న్‌లో ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు తప్పడం లేదు. కాగా, 2004 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లను 5,21,691 మంది చూసినట్టు అధికార గణాంకాలు చెప్తున్నాయ. గత ఏడాది ఈ సంఖ్య 7,03,899కి చేరింది. అంతకు ముందు రెండేళ్లతో పోలిస్తే, గత ఏడాది హాజరైన ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. 2012లో 6,86,006 మంది, 2013లో 6,84,467, 2014లో 5,74,388 మంది మ్యాచ్‌లను చూశారు. అంతకు ముందు మూడేళ్లుగా సంఖ్య తగ్గినా గత ఏడాది గణనీయంగా పెరగతం విశేషం.

ఇండోర్ కోర్టులను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పైకప్పును మూసిన తర్వాత
ఎయిర్ కూలర్ల సాయంతో ఉష్ణోగ్రతను తగ్గించి, ఆటను కొనసాగించాలని కొంత మంది చేస్తున్న సూచన ఆచరణ యోగ్యం కాదన్న వాదన ఉంది. విద్యుత్ సరఫరాకు
అంతరాయం లేకుండా జాగ్రత్త పడితే, స్టేడియం మొత్తానికి ఎయిర్ కూలర్లు పెట్టినంత గొప్ప. ఇండోర్ స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని నిర్వాహకులు భయపడుతున్నాయ. అయతే, లాభాల కోసం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారా? అంటూ అటు పోటీదారులు, ఇటు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఈ సమస్యకు
ఎప్పుడు తెరపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

భారీ ఫ్యాన్లతో ఊరట
తీవ్రమైన ఉష్ణోగ్రత నుంచి తప్పించుకోవడానికి భారీ ఫ్యాన్లు, మంచును పొగరూపంలో బయటకు పంపే యంత్రాల వద్ద ప్రేక్షకులు బారులు తీరుతారు. క్రీడాకారుతో సమానంగా ఐస్ ప్యాక్‌లను తలపై పెట్టుకొని ఉపసమనం కోసం ప్రయత్నిస్తారు. ఒకవైపు వేడికి తాళలేక ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటూనే మరోవైపు ఈ టోర్నీని తిలకించడానికి పోటెత్తడం ఆస్ట్రేలియా ఓపెన్ అభిమానుల ప్రత్యేకత.