ఆటాపోటీ

మేటి కీపర్ కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపిఎల్‌లో అత్యుత్తమ వికెట్‌కీపర్‌గా దినేష్ కార్తీక్ రికార్డు నెలకొల్పాడు. అతను 84 మ్యాచ్‌ల్లో84 మందిని అవుట్ చేశాడు. వీటిలో 61 క్యాచ్‌లుకాగా, 23 స్టంపింగ్స్ ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ 77 (క్యాచ్‌లు 54, స్టంపింగ్స్ 23), ఆడం గిల్‌క్రిస్ట 67 (క్యాచ్‌లు 51, స్టంపింగ్స్ 16), రాబిన్ ఉతప్ప 61 (క్యాచ్‌లు 39, స్టంపింగ్స్ 22), పార్థీవ్ పటేల్ 53 (క్యాచ్‌లు 42, స్టంపింగ్స్ 11) డిస్మిసల్స్‌తో ఈ జాబితాలో రెండు నుంచి ఐదు స్థానాలను ఆక్రమించారు.
ఫీల్డింగ్ విషయానికి వస్తే అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడు సురేష్ రైనా. అతను 132 మ్యాచ్‌ల్లో 75 క్యాచ్‌లు పట్టాడు. రోహిత్ శర్మ 128 మ్యాచ్‌ల్లో 59, డ్వెయిన్ బ్రేవో 91 మ్యాచ్‌ల్లో 54, కీరన్ పోలార్డ్ 93 మ్యాచ్‌ల్లో 50, విరాట్ కోహ్లీ 123 మ్యాచ్‌ల్లో 49 చొప్పున క్యాచ్‌లు అందుకున్నారు.