ఆటాపోటీ

భారీ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా లేదా ఆటగాళ్లతో అభిప్రాయ భేదాలు వచ్చినా క్రికెట్ అధికారులు ఏం చేస్తారు? సహజంగా ఒకరిద్దరు ఆటగాళ్లను తప్పించి, కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా మిగతా వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే, 1884లో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆడిన ఆస్ట్రేలియాకు అక్కడి సెలక్టర్లు పెద్ద షాకిచ్చారు. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అదే సమయంలో వేతనాల పెంపుపై ఆటగాళ్లు నిరసకు దిగడంతో, మెల్బోర్న్‌లో జరిగిన రెండో టెస్టును క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు అంతా కొత్తవారితోనే ఆడించారు. ఒక టెస్టుకు, మరో టెస్టుకు ఈ విధంగా ఆటగాళ్లంతా మూకుమ్మడిగా మారిపోయిన సంఘటన క్రికెట్ చరిత్రలో అదొక్కటే. సిడ్నీలో మూడో టెస్టు ఆరంభానికి ముందే ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో, తిరిగి పాతకాపులే జట్టులోకి వచ్చారు. మొత్తం మీద అధికారులు తలచుకుంటే ఏమైనా చేయగలరని, జట్టుకు జట్టునే పూర్తిగా మార్చివేయగలరని ఆ సంఘటన స్పష్టం చేస్తున్నది.

ఫ్లవర్ ‘డబుల్’

* జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ అండీ ఫ్లవర్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కీపర్‌గానూ సేవలు అందించిన క్రికెటర్లలో అత్యధిక స్కోరు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక టెస్టులో అటు కెప్టెన్‌గా, ఇటు వికెట్‌కీపర్‌గా వ్యవహరిస్తూ డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లు ఎనిమిది ఉన్నారు. వీరిలో ఆండీ ఫ్లవర్ అత్యధికంగా 232 (నాటౌట్) పరుగులు సాధించాడు. భారత్‌కు టెస్టుల్లో కెప్టెన్సీ వహించిన మహేంద్ర సింగ్ ధోనీ 224 పరుగులు చేశాడు. జాబితాలో అతనికి మూడో స్థానం. కుమార సంగక్కర 230 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తస్లీం ఆరిఫ్ (210 నాటౌట్), ఇంతియాజ్ అహ్మద్ (209), ఆడం గిల్‌క్రిస్ట్ (204 నాటౌట్), బ్రెండన్ కురుప్పు (201 నాటౌట్), ముష్ఫికర్ రహీం (200) కూడా డబుల్ సెంచరీ సాధించిన వికెట్‌కీపర్ కెప్టెన్ల జాబితాలో ఉన్నారు. దక్షిణాఫ్రికాపై ఫ్లవర్ అజేయంగా 199 పరుగులు చేసి, రెండోసారి డబుల్ సెంచరీ సాధించే ఘనతను కొద్దిలో కోల్పోయాడు.

దురదృష్టవంతుడు!

* క్రికెట్‌లో దురుదృష్టవంతుడు ఎవరంటే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు బ్రియాన్ క్లోస్ అని సమాధానం చెప్పాలి. 1949 జూలైలో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతను చివరి టెస్టును 1976 జూలైలో ఆడాడు. 1949-1976 మధ్యకాలంలో అతను 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అతను ఆడిన మొదటి, చివరి టెస్టు మధ్య ఇంగ్లాండ్ 244 టెస్టులు ఆడింది. క్లోస్‌కు 222 టెస్టుల్లో స్థానం దక్కలేదు. అతని కంటే దురదృష్టవంతుడు ఎవరుంటారు? ఈ జాబితాలో రెండో స్థానం పాట్ పొకాక్‌కు దక్కుతుంది. కెరీర్ మధ్యలో ఎనిమిది సంవత్సరాలు స్వచ్ఛందంగా విరామం తీసుకున్న అతను తన కెరీర్ మొదటి, చివరి మ్యాచ్‌ల మధ్యకాలంలో 145 టెస్టుల్లో ఆడలేకపోయాడు.

అభిమాని ఓవరాక్షన్!

* ఓ అభిమాని చేసిన ఓవరాక్షన్ వల్ల కెన్యా మారథాన్ రన్నర్ జెమిమా సంగాంగ్‌ను ఇబ్బందికి గురైంది. బోస్టన్, చికాగో, న్యూయార్క్ మారథాన్ రేసులను గెల్చుకున్న ఆమె లండన్ మారథాన్‌లో పాల్గొంది. మేరీ కీటానీ ముందుకు దూసుకెళుతుండగా, ఆమెను అధిగమించే ప్రయత్నంలో పడింది. 23వ మైలు ముగిసే సమయంలో హఠాత్తుగా ఓ అభిమాని జెమిమా వైపు పరుగులు పెట్టాడు. భద్రతా సిబ్బందిని తప్పించుకొని, జెమిమా ముందుకు వెళ్లాడు. ఈ సంఘటనను ఊహించని ఆమె బలంగా అతనిని ఢీకొని కింద పడింది. మొదట దిగ్భ్రాంతి చెందినా, క్షణాల్లోనే కోలుకుంది. తలకు గాయమై రక్తం కారుతున్నా లక్ష్యపెట్టకుండా పరుగును కొనసాగించింది. జెమిమాను అడ్డుకున్న అభిమానిని పోలీసులు కటకటల్లోకి నెట్టారు. గెలవడం అసాధ్యమని అందరూ అనుకున్నా, జెమిమా మాత్రం పట్టుదలతో రేస్‌ను పూర్తి చేయడమేకాదు.. విజేతగా నిలవడం కొసమెరుపు.

- శ్రీహరి