ఆటాపోటీ

మలింగ విశ్వప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయంతో బాధపడుతున్నానని అంటూ ప్రతిష్టాత్మక టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి నిరాకరించిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఐపిఎల్‌లో ఆడేందుకు ఉత్సాహం చూపాడు. ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సిన అతను చివరి వరకూ ఐపిల్‌లో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, జాతీయ జట్టుకు ఆడేందుకు అడ్డు వచ్చిన ఫిట్నెస్ సమస్య ఇప్పుడు ఏమైందంటూ శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అధికారులు మలింగను నిలదీశారు. ఐపిఎల్‌లో పాల్గొంటే, ఆతర్వాత లంక జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని
శాశ్వతంగా కోల్పోతా
వని హెచ్చరించారు. ఎలాగైనా ఐపిఎల్‌లో ఆడి, మ్యాచ్ ఫీజుల పేరుతో కొంత మొత్తాన్ని వెనకేసుకుందామని ఆశించిన మలింగకు ఎస్‌ఎల్‌సి షాకిచ్చింది. మోకాలి నొప్పితో ఐపిఎల్‌ను ఎలా ఆడతావంటూ నిలదీసింది. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ పరువుపోతుందన్న భయంతో మలింగ తొమ్మిదో ఐపిఎల్‌లో పాల్గొనకుండానే స్వదేశానికి వెళ్లిపోయాడు.