ఆటాపోటీ

హింగిస్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం భారత క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అరుదైన రికార్డును నెలకొల్పి సంచలనం సృష్టించింది. 1997లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకునే సమయానికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఈ టోర్నీ సింగిల్స్ విజేతల్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. మహిళల సింగిల్స్‌లో టైటిల్ సంపాదించే సమయానికి ఎక్కువ యవసున్న క్రీడాకారిణి థియెమా కోనే లాంగ్. 1954లో ఆమె తన 36వ ఏట టైటిల్ సాధించింది.

గ్రాస్ నుంచి ఫ్లెక్సీ కుషన్‌కు

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీ గ్రాస్‌ల్లో మొదలైంది. క్రమంగా మార్పులు చోటుచేసుకోగా, ప్రస్తుతం ఫ్లెక్సీకుషన్‌కు చేరింది. ఈ టోర్నీలో 1988 సంవత్సరానికి ముందు వరకూ పోటీలు గ్రాస్ కోర్టులపైనే జరిగేవి. 1989 నుంచి 2007 వరకు కృత్రిమ పచ్చిక ‘గ్రీన్ రిబౌండ్ ఏస్’ కోర్టులు మ్యాచ్‌లకు వేదికలయ్యారు. 2008 నుంచి కోర్టు పూర్తిగా నీలం రంగులోకి మారింది. ప్రత్యేక ఆకర్షణతో మెరిసిపోయే ఫ్లెక్సీకుషన్ కోర్టులు ఈ టోర్నీకి ప్రత్యేతను సంపాదించిపెట్టాయ.

సూపర్ స్టార్ రోజ్‌వాల్
కెన్ రోజ్‌వాల్‌ను ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ స్టార్‌గా పేర్కోవాలి. అతను ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ టైటిల్‌ను సాధించిన అతి పిన్న వయస్కుడిగా, ఎక్కువ వయసుగల ఆటగాడిగా, రెండు రికార్డులూ అతని పేరిటే ఉన్నాయి. 1953లో విజేతగా నిలిచినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. 1972లో అతను తన 37వ ఏట మరో టైటిల్ సాధించాడు.
ఒకే వ్యక్తి అతి పిన్న వయస్కుడిగా, ఎక్కువ వయసు ఉన్న ఆటగాడిగా టైటిళ్లను అందుకోవడం గ్రాండ్ శ్లామ్ చరిత్రలో అదే మొదటిది. ఇప్పటి వరకూ అదే చివరిది కూడా. - సత్య