ఆటాపోటీ

బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదో ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిప త్యం స్పష్టంగా కనిపించింది. ఒక వికెట్‌కు సగటున 28.36 పరుగులు జత కలిశాయి. 2014లో వికెట్‌కు సగటున 28.18 పరుగులు నమోదయ్యాయి. ఆ రికార్డును తొమ్మిదో ఐపిఎల్ అధిగమించింది. విరాట్ కోహ్లీ 973 పరుగులు సాధించాడు. ఒక సీజన్‌లో ఒక బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో అతను అగ్రస్థానాన్ని సంపాదించాడు. అంతేగాక, ఐపిఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ పట్టికలో సురేష్ రైనాను రెండో స్థానానికి నెట్టిన కోహ్లీ నంబర్ వన్‌గా ఎదిగాడు. కాగా, ఈ ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 848 పరుగులు సాధించాడు. ఒక సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ రికార్డును పంచుకుంటున్న క్రిస్ గేల్ (2012లో 733 పరుగులు), మైఖేల్ హస్సీ (2013లో 733 పరుగులు)లను కోహ్లీ, వార్నర్ ఏకంగా మూడో స్థానానికి నెట్టేశారు. వార్నర్ సాధించిన పరుగుల్లో 468 పరుగులు లక్ష్యాన్ని ఛేదిచే సమయంలో చేసినవే కావడం విశేషం. ఒక ఐపిఎల్ సీజన్‌లో ఈ విధంగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను 2014లో రాబిన్ ఉతప్ప 457 పరుగులతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు. ఎబి డివిలియర్స్ 687 పరుగులు చేసి, ఒక ఐపిఎల్ సీజన్‌లో నాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును నెలకొల్పాడు.
2013లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్లాట్‌లో రాకుండా 578 పరుగులు చేయగా, డివిలియర్స్ ఆ రికార్డును బద్దలు చేశాడు. డివిలియర్స్ ఈ సీజన్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం విశేషం. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ సురేష్ రైనా, అతని ఖాతాలో 375 పరుగులు ఉన్నాయి. ఈ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఏడు జట్ల బ్యాట్స్‌మెన్ సగటున 27.39 పరుగులు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సెకండ్ డౌన్ బ్యాట్స్‌మెన్ మాత్రం 56.53 సగటుతో సత్తా చాటారు.