ఆటాపోటీ

కెప్టెన్ల టోర్నమెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి ఐపిఎల్ కెప్టెన్ల టోర్నీగా మారిపోయింది. దాదాపుగా అన్ని జట్ల కెప్టెన్లు ఈ టోర్నీలో అద్భుతంగా రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు సాధించి ఒక రికార్డును, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులను నమోదు చేసి అధిగమించి మరో రికార్డును నెలకొల్పాడు. తొమ్మిదో ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. కాగా, రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన అసాధారణ ప్రతిభతో ఏకంగా జట్టుకు టైటిల్‌నే సాధించిపెట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు స్వర్గ్ధామంగా మారిన ఈ ఐపిఎల్ స్పిన్నర్లకు మాత్రం చుక్కలు చూపెట్టింది. మొత్తం మీద టోర్నీ గ్రూప్ దశలో 56 మ్యాచ్‌లు జరిగాయి. రెండు క్వాలిఫయర్స్, ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్‌తో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య అరవైకి చేరింది. వీటిలో 41 మ్యాచ్‌ల్లో వివిధ జట్లు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించాయి. 19 మ్యాచ్‌ల్లో మాత్రం ఛేజింగ్‌లో విఫలమయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడడం ఐపిఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. టాస్ గెలిచిన జట్లు పీల్డింగ్ ఎంచుకున్న సందర్భాలు సగటున 81.67 శాతం. ఇంత భారీగా గతంలో ఎన్నడూ టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌పైకు మొగ్గు చూపలేదు. 2014లో 68.33 శాతంగా నమోదైన ఫీల్డింగ్ ఆప్షన్ ఈసారి 13.34 శాతం పెరిగింది. మ్యాచ్‌ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే, మొత్తం 60 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకున్న సందర్భాలు 49. మిగతా 11 పర్యాయాలు మాత్రమే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కాగా, టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధ్యమయ్యాయి. మిగతా తొమ్మిది మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ ఎంచుకున్న జట్లకు పరాభవం తప్పలేదు. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకొని విజయాలు నమోదైనది రెండు సందర్భాలుకాగా, ఆ రెండూ సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించినవే కావడం విశేషం. గ్రూప్ దశలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్ ఫైనల్‌లో బెంగళూరును కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాతే చిత్తుచేసి టైటిల్ అందుకుంది.