ఆటాపోటీ

టూర్ డి ఫ్రాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయాపజయాల విషయం ఎలావున్నా ఇది సాదాసీదా సైక్లింగ్ రేస్ కాదు. పచ్చని పంటపొలాలు, పిల్లకాలువలు, ఎత్తయిన కొండల మీదుగా సాగే ఈ రేస్‌ను ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ రేస్‌లో కల్నల్ డు టర్మలెట్ అతి క్లిస్టమైన దశ. 1910లో తొలిసారి ఈ మార్గం మీదుగా రేస్‌ను కొనసాగించగా, అక్టోవ్ లాపెజ్ మొదటి విజేతగా నిలిచాడు. 1947 నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా ఈ మార్గం మీదుగా రేస్ కొనసాగిస్తున్నది. 1936 నుంచి 1987 మధ్యకాలం టూర్ డి ఫ్రాన్స్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన జాక్వెస్ గాడెట్ పట్ల గౌరవ భావంతో ఈ మార్గానికి కల్నల్ డు టర్మలెట్‌గా నామకరణం చేశారు. సముద్ర మట్టానికి 6,939 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మార్గం 174 కిలోమీటర్ల పొడవు ఉంది. నిటారుగా ఉండే పలు ప్రాంతాల్లో వాహనాలను ముందుకు నడిపించడమే కష్టసాధ్యంగా మారుతుంది. అలాంటిది సైకిళ్లపై పర్వతాలను దాటడం సాహసమే. పచ్చిక మైదానాలు... ఎత్తయిన కొండలు... పర్వతాలు... ఒక్కో ‘స్టేజీ’ని అధిగమిస్తూ వెళ్లే రైడర్లు... కేరింతలు కొట్టే అభిమానులు.. అత్యవసర సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉండే బృందాలు.. ఇవీ టూర్ డి ఫ్రాన్స్ సైకిల్ రేస్ ప్రత్యేకతలు. గంటల తరబడి అవిశ్రాంతంగా సైకిల్ తొక్కడం అనుకున్నంత సులభం కాదు. ఘాట్ రోడ్లపై సైకిళ్లను ముందుకు దూకించడానికి అపారమైన శక్తిసామర్థ్యాలేకాదు, అనంతమైన ఆత్మవిశ్వాసం కూడా కావాలి. ఇలాంటి విలక్షణమైన, ప్రత్యేక లక్షణాలను సైక్లిస్టులు కలిగి ఉంటారు కాబట్టే పర్వతాలు కూడా వారి దృఢ సంకల్పం ముందు తల దించుకుంటాయి. 112 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 113వ వసంతంలోకి అడుగుపెట్టిన టూర్ డి ఫ్రాన్స్, మరోసారి అభిమానులకు కనువిందు చేయనుంది. జూలై 4న ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక రేసును గెల్చుకొని, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని మిగుల్చుకోవడానికి 198 మంది రైడర్లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నిరుటి విజేత బ్రాడ్లీ విగిన్స్ టైటిల్ నిలబెట్టుకోవడం ఈసారి కష్టంగానే కనిపిస్తోంది. 2012లో విగిన్స్‌తో చివరి వరకూ పోటీపడి, రెండో స్థానంలో నిలిచిన క్రిస్ ఫ్రూమ్ 2013లో టైటిల్ సాధించాడు. అతను ఈసారి ఫేవరిట్‌గా బరిలో దిగుతున్నాడు. విగిన్స్, ఫ్రూమ్‌లకు మాజీ చాంపియన్ అల్బెర్టో కాంటడార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. ప్రపంచ క్రీడా రంగంలోనే అతిపెద్ద ఈవెంట్‌గా రికార్డులకెక్కిన టూర్ డి ఫ్రాన్స్‌లో ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
113వ రేస్ కాదు..
టూర్ డి ఫ్రాన్స్ 1903లో ప్రారంభమై, 113వ ఏట అడుగుపెట్టింది. కానీ, ఇప్పుడు జరుగుతున్నది 113వ రేస్ మాత్రం కాదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా మొత్తం 11 పర్యాయాలు ఈ రేస్‌ను నిర్వహించలేదు. ఆ రకంగా చూసుకుంటే, ఇది 102వ రేస్ అవుతుంది. 2007లో ఫ్లాయిడ్ లాండిస్ (2006 విజేత) టైటిల్‌ను రద్దు చేశారు. అతను విచారణలో బయటపెట్టిన సమాచారం ప్రకారమే ఆర్మ్‌స్ట్రాంగ్‌పై విచారణ కొనసాగింది. ఏడు పర్యాయాలు టైటిల్ సాధించిన ఆర్మ్‌స్ట్రాంగ్‌పై సస్పెన్షన్ వేటు పడేందుకు కారణమైంది. కాగా, ఆర్మ్‌స్ట్రాంగ్ టైటిళ్లు సాధించిన 1999-2005 కాలంలో ద్వితీయ స్థానంలో ఉన్న రైడర్లను విజేతలుగా ప్రకటించడానికి యుసిఐ నిరాకరించింది. ఆ సంవత్సరాల్లో టైటిల్ ఎవరికీ దక్కదని స్పష్టం చేసింది.
జెర్సీలు..
టూర్ డి ఫ్రాన్స్ రేసులో ఒక్కో స్టేజీ ముగిసిన తర్వాత రైడర్లకు వారు చూపిన ప్రతిభను బట్టి జెర్సీలను ఇవ్వడం 1919 నుంచి ఆరంభమైంది. ఫ్రెంచ్ వార్తా పత్రిక ఎల్’ఆటో (ప్రస్తుతం దీనిని ఎల్’ఎక్విప్‌గా పిలుస్తున్నారు) ఈ రేస్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. రేస్‌కు సంబంధించిన వార్తలను ప్రత్యేకమైన రంగుల పేజీల్లో వేసేది. ఆ రంగులే జెర్సీలకూ వాడే సంప్రదాయం కొనసాగుతున్నది. ఓవరాల్ చాంపియన్‌కు ఎల్లో (పసుపు) జెర్సీ దక్కుతుంది. పర్వత్ర శ్రేణుల విభాగంలో అందరి కంటే ముందుగా లక్ష్యాన్ని చేరిన రైడర్‌కు రెడ్ (ఎరుపు) జెర్సీని ఇస్తారు. టూర్ మధ్యలో, ఆతర్వాత చివరిలో అందచేసే ‘స్ప్రింటింగ్ పాయింట్స్’ ఆధారంగా గ్రీన్ (ఆకుపచ్చ) జెర్సీని అందిస్తారు. 25 లేదా అంతకు తక్కువ వయసుగల రైడర్లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని వైట్ (తెలుపు) జెర్సీ వరిస్తుంది.
విశేష స్పందన
టూర్ డి ఫ్రాన్స్ రేస్ ప్రారంభాన్ని ‘గ్రేట్ డిపార్ట్’గా పిలిచే ఈ పోటీలకు విశేష స్పందన లభిస్తుంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3.5 బిలియన్ల మంది టీవీల్లో ఈ రేస్‌ను వీక్షిస్తారని అంచనా. 188 దేశాల్లో ఇది ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఏటా 121 వేరువేరు టీవీ చానెళ్లు టూర్ డి ఫ్రాన్స్‌ను కవర్ చేస్తాయి. కనీసం 2,000 మంది పాత్రికేయులు ఈ రేస్ వివరాలను ఎప్పటికప్పుడు కవర్ చేస్తుంటారు. వివిధ జట్లు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, టూర్ అధికారుల కోసం 1,200 హోటల్ గదులను బుక్ చేస్తారు. మొత్తం మీద టూర్ డి ఫ్రాన్స్‌ను 1.2 కోట్ల మంది ప్రత్యక్షంగా చూస్తారు. సైక్లిస్టులతో కలిసి ముందుకు వెళుతూ, వీరంతా సగటున 130 కిలోమీటర్ల దూరం పరుగులు తీస్తారు. ఎక్కువ మంది ప్రేక్షకులు రోజుకు ఆరు గంటలు రోడ్డు పక్కనే నిలబడే ఉంటారు. వీరిలో సుమారు 30 శాతం మంది మహిళలే.
రికార్డులు
కెరీర్ మొత్తంలో అత్యధిక స్టేజీల్లో గెలుపొందిన రైడర్‌గా ఎడ్డీ మెక్‌కెక్స్ రికార్డు సృష్టించాడు. అతను 1969లో ఆరు, 1970లో ఎనిమిది, 1971లో నాలుగు, 1972లో ఆరు, 1974లో ఎనిమిది స్టేజీల్లో విజేతగా నిలిచాడు. కెరీర్‌లో అతను స్టేజ్ విజయాల సంఖ్య 34. ఒక టూర్‌లో అత్యధిక స్టేజ్ విజయాలు ఎనిమిది. 1930లో చార్లెస్ పెలిసియర్, 1970, 1974 సంవత్సరాల్లో ఎడ్డీ మెక్‌కెక్స్, 1976లో ఫ్రెడ్డీ మార్టెన్స్ ఈ రికార్డును నమోదు చేశారు. కాగా, స్టేజ్ విజేతకు ఇచ్చే ఎల్లో జెర్సీని ఎక్కువ రోజులు ధరించిన రైడర్ ఎడ్డీ మెక్‌కెక్స్. అతను కెరీర్‌లో మొత్తం 96 రోజులు ఎల్లో జెర్సీ ధరించాడు.
1952లో స్టాన్ ఒకెర్స్‌పై ఫాస్టొ కొపీ 28 నిమిషాల 27 సెకన్ల తేడాతో విజయం సాధించాడు. టూర్ డి ఫ్రాన్స్ చరిత్రలోనే ఎక్కువ తేడాతో గెలుపొందిన రైడర్‌గా కొపీ రికార్డు సృష్టించాడు. కాగా, 1989లో లారెంట్ ఫిగ్నాన్‌పై గ్రెగ్ లెమాండ్ కేవలం 8 సెకన్ల తేడాతో గెలిచాడు. హోరాహోరీగా సాగిన రేస్ ఇదే. ఆ రేస్‌లోనే లెమాండ్ 24.5 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 54.930 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేశాడు. టూర్ డి ఫ్రాన్స్‌లో అత్యంత వేగంగా సైకిల్ తొక్కిన రైడర్‌గా అతను మరో రికార్డును సృష్టించాడు.
ఫిర్మిన్ లాంబట్ 1922లో రేస్‌ను గెల్చుకునే సమయానికి అతని వయసు 36 సంవత్సరాలు. ఎక్కువ వయసులో విజేతగా నిలిచిన రైడర్‌గా అతని రికార్డును ఇప్పటి వరకూ ఎవరూ ఛేదించలేదు. హెన్రీ కార్నెట్ 1904లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ అందుకునే సమయానికి అతని వయసు కేవలం 20 ఏళ్లు.
అత్యధిక పర్యాయాలు ఈ రేస్‌లో పాల్గొన్న రైడర్ జూప్ జొడెమెల్క్. 1970-1986 మధ్యకాలంలో అతను 16 పర్యాయాలు టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్నాడు. ప్రతిసారీ అతను రేస్‌ను పూర్తి చేయడం మరో విశేషం.
జాక్వెస్ ఆంక్వెటిల్ (ఫ్రాన్స్) 1957లో మొదటిసారి, తిరిగి 1961 నుంచి 1964 వరకు టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ సాధించాడు. ఐదు పర్యాయాలు విజేతగా నిలిచిన అతను ఎడ్డీ మెక్‌కెక్స్, బెర్నార్డ్ హినాల్ట్, మిగెల్ ఇండురైన్‌తో కలిసి ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన సైక్లిస్టుగా రికార్డు పుస్తకాలోకి ఎక్కాడు. వాస్తవానికి లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అత్యధికంగా ఏడు పర్యాయాలు ఈ టైటిల్ సాధించాడు. అయితే, తాను డోపింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించడంతో అతని టైటిళ్లతోపాటు రికార్డులను కూడా రద్దు చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ పేరు మాయం కావడంతో, ఎక్కువ టైటిళ్లు సాధించిన రైడర్స్‌గా నలుగురి పేర్లు చేరాయ. కాగా, మిగెల్ ఇండురైన్ 1991 నుంచి 1995 వరకూ వరుసగా ఐదు పర్యాయాలు టైటిల్ సాధించాడు. వరుస టైటిళ్ల రికార్డు ఇది. ఆర్మ్‌స్ట్రాంగ్ 1999 నుంచి 2005 వరకూ ఏడుసార్లు టూర్ డి ఫ్రాన్స్‌ను గెల్చుకున్నాడు. కానీ, అతని రికార్డును రద్దు చేశారు.
క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి
సైక్లింగ్ క్రీడకు ఈ ఏడాది అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏడు సార్లు టూర్ డి ఫ్రాన్స్ చాంపియన్ ఆర్మ్‌స్ట్రాంగ్ డోపీగా తేలడంతో క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. కేన్సర్ చివరి స్టేజ్‌లో ఉన్నా కోలుకుని మరీ విజయాలు సాధించడంతో అతను సాధించిన కీర్తిప్రతిష్టలు అన్నీ ఇన్నీ కావు. అయితే, సంవత్సరాల తరబడి అందరి కళ్లుగప్పి చరిత్రలోనే మరెవరికీ సాధ్యపడని వ్యవస్థీకృత డోపింగ్‌కు ఆర్మ్‌స్ట్రాంగ్ పాల్పడ్డాడని ఆతర్వాత వెల్లడయింది. సైక్లింగ్‌లో ఇదే పెద్ద మోసమని నిర్ఘాంతపోవడం మినహా ఎవరూ చేసేదేమీ లేకపోయింది. డోపింగ్ బయటపడకుండా తన సహచరుల సహాయాన్ని సంవత్సరాల తరబడి పొందడం ఈ దుర్మార్గానికి పరాకాష్ట. పక్కాసాక్ష్యాధారాలతో అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఆర్మ్‌స్ట్రాంగ్‌ను దోషిగా తేల్చడంతో అప్పటి వరకూ తాను నిర్దోషినంటూ వాదించిన అతను న్యాయపోరాటం నుండి విరమించుకున్నాడు. దీంతో అతను సాధించిన టూర్ డి ఫ్రాన్స్ టైటిళ్లను కోల్పోయాడు. 1998 ఆగస్టు 1 నుండి అతను సంపాదించిన అన్ని ట్రోఫీలను అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ (యుసిఐ) వెనక్కితీసుకుంది. అతను ప్రాతినిథ్యం వహించిన అమెరికన్ పోస్టల్ జట్టుకు 17 ఏళ్లుగా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న రాబో బ్యాంక్ ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. ఆర్మ్‌స్ట్రాంగ్ ఉదంతం ఇతర దేశాల సైక్లింగ్ సమాఖ్యలలో కూడా ప్రకంపనలు సృష్టించింది. అతనికి డోపింగ్‌లో తోడ్పాటును అందించినందుకు మాజీ సహచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ కారణంగా సైక్లిస్టులు సాధించే రికార్డులను అభిమానులు అనుమానించే అవకాశం లేకపోలేదు.
.......................................................
టూర్ డి ఫ్రాన్స్‌లో ఒక్క రోజులో సైక్లిస్టులు వెళ్లాల్సిన మార్గాన్ని, పూర్తి
చేయాల్సిన దూరాన్ని ముందుగానే నిర్ధారిస్తారు. దీనినే ‘స్టేజ్’గా వ్యవహరి
స్తారు. 1903లో ప్రారంభమైన టూర్ డి ఫ్రాన్స్ 103వ పోటీలు జూలై 2న
మొదలై 24వ తేదీతో ముగుస్తాయ. దమ్మున్న సైక్లిస్టులు మాత్రమే టూర్ డి
ఫ్రాన్స్‌లో పాల్గొంటారు. సమర్థులకు మాత్రమే అందులో పోటీపడే
అవకాశం ఉంటుంది. మూడు వారాల పాటు, 3,600 కిలోమీటర్ల దూరాన్ని
పూర్తి చేయడానికి సైక్లిస్టులు సర్వశక్తులను ధారపోయాలి. సహజంగా
జూన్ లేదా జూలై మాసాల్లో మొదలయ్యే ఈ రేస్ మూడు వారాలు కొనసా
గుతుంది. 1903లో టూర్ డి ఫ్రాన్స్ మొదలైంది. ఈ రేస్ తొలి విజేత
వౌరిస్ గారిన్. అప్పటి నుంచి గత ఏడాది వరకూ జరిగిన రేసుల్లో ఫ్రాన్స్
అత్యధికంగా 36 పర్యాయాలు విజేతగా నిలిచింది.
................................

- శ్రీహరి