ఆటాపోటీ

పరువు కోల్పోయన ఆర్మ్‌స్ట్రాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా సైక్లిస్టు లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఏడు పర్యాయాలు టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. కానీ, నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన కారణంగా అతను పరువుతో పాటు టైటిళ్లను, రికార్డులను కోల్పోయాడు. డోపింగ్ విషయం బయటపడక ముందు అతను రియల్ హీరోగా వెలిగిపోయాడు. కెరీర్‌లో చివరిసారి టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్నప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌కు అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలాస్ సర్కోజీ స్వయంగా వచ్చి అభినందనలు తెలిపాడంటే, అతని ఉన్న క్రేజీ ఎలాంటిదో అర్థమవుతుంది. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను సర్కోజీ కలిసినప్పుడు ఓ టీవీ కామెంటేటర్ సరదాగా మాట్లాడుతూ ఇద్దరి స్థానాలు తారుమారైతే బాగుంటుందని చమత్కరించాడు. సరోజీని టూర్ డి ఫ్రాన్స్ విజేతగా, ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడిగా చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు. దీనికి సర్కోజీ అంతే సరదాగా సమాధానం చెప్పాడు. కష్టపడితే ఆర్మ్‌స్ట్రాంగ్ ఫ్రాన్స్‌కు అధ్యక్షుడవుతాడేమోగానీ, తాను మాత్రం ఎన్నటికీ సైక్లింగ్ చాంపియన్‌ను కాలేనని తేల్చి చెప్పాడు. క్యాన్సర్ వ్యాధి సోకినప్పటికీ, ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యను అధిగమించిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ను మృత్యుంజయుడిగా సర్కోజీ కీర్తించాడు. ఇది వాస్తవం కూడా. క్యాన్సర్ కారణంగా మృత్యు ముఖంలోకి వెళ్లినప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్ బతికి బైటపడతాడని ఎవరూ ఊహించలేదు. మళ్లీ సైక్లింగ్ పోటీల్లో పాల్గొనడం అద్భుతమేనని అంతా వ్యాఖ్యానించారు. కానీ, ఈ రెండింటినీ ఆర్మ్‌స్ట్రాంగ్ సాధించి చూపాడు. అందుకే మాదక ద్రవ్యాలను వాడినట్టు రుజువై, విమర్శలకు గురవు తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా మంది దృష్టిలో ఆర్మ్‌స్ట్రాంగ్ ఒక అసాధారణ సైక్లిస్టు. ఆత్మవిశ్వాసానికి మారుపేరు.