ఆటాపోటీ

ఇదో నమ్మకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటగాళ్లలో చాలా మందికి ఏదో ఒక అలావాటు లేదా నమ్మకం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎదుటివారికి హాస్యాస్పదంగా కనిపించే చాలా నమ్మకాలు ఎంతో మందిలో కనిపిస్తాయ. ప్రపంచ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఇందుకు అతీతుడేమీ కాదు. అతనికీ ఓ వింత నమ్మకం ఉంది. మ్యాచ్‌లు ఆడే ప్రతిసారీ అతను తన వాటర్ బాటిల్‌ను కుర్చీకి మధ్యగా ఉంచుతాడు. నీళ్లు తాగిన తర్వాత మళ్లీ అదే ప్రదేశంలో దాన్ని ఉంచుతాడు. ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ జరగకుండా ప్రతిసారీ ఒకే చోట వాటర్ బాటిల్‌ను ఉంచితే విజయం తనేదనని అతని నమ్మకం. ఇదేం విడ్డూరం అంటూ ఎవరైనా నవ్వినా అతను పట్టించుకోడు. ఎన్నో టోర్నీల్లో తన సత్తా చాటిన నాదల్‌కు నమ్మకాల బలహీనత మాత్రం పోవడం లేదు.