ఆటాపోటీ

30వ సారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వనే్డలో భారత ఆటగాడు రోహిత్ శర్మ 99 పరుగులు చేసి, కేవలం ఒక పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకోవడం అభిమానులను నిరాశ పరచింది. వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఒక ఆటగాడు 99 పరుగుల స్కోరువద్ద అవుట్ కావడం ఇది 30వ సారి. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ మూడు సార్లు, శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య రెండు పర్యాయాలు 99 పరుగులకు అవుటై వెనుదిరిగారు. ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ జెఫ్ బాయ్‌కాట్ ఈ విధంగా అవుటైన తొలి ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. 1980 ఆగస్టు 20న ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను 159 బంతులు ఎదుర్కొని 99 పరుగులు చేసి అవుటయ్యాడు.
99 పరుగుల వద్ద తడబడి
సెంచరీ పూర్తి చేయలేకపోయిన ఆటగాళ్ల వివరాలు..
01. జెఫ్ బాయ్‌కాట్ (ఇంగ్లాండ్/ 1980 ఆగస్టు 20న ఆస్ట్రేలియాపై), 02. అలాన్ లాంబ్ (ఇంగ్లాండ్/ 1982 జూన్ 4న భారత్‌పై), 03. కృష్ణమాచారి శ్రీకాంత్ (్భరత్/ 1984 డిసెంబర్ 27న ఇంగ్లాండ్‌పై), 04. క్రిస్ బ్రాడ్ (ఇంగ్లాండ్/ 1987 మే 21న పాకిస్తాన్‌పై), 05. రమీజ్ రజా (పాకిస్తాన్/ 1987 నవంబర్ 20న ఇంగ్లాండ్‌పై), 06. లాన్స్ క్లూస్నర్ (దక్షిణాఫ్రికా/ 1997 నవంబర్ 8న శ్రీలంకపై), 07. కలువితరణ (శ్రీలంక/ 1999 డిసెంబర్ 18న జింబాబ్వేపై), 08. మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా/ 2001 మార్చి 25న భారత్‌పై), 09. సనత్ జయసూర్య (శ్రీలంక/ 2001 ఆగస్టు 5న భారత్‌పై), 10. వివిఎస్ లక్ష్మణ్ (్భరత్/ 2002 నవంబర్ 9న వెస్టిండీస్‌పై), 11. గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా/ 2002 నవంబర్ 29న శ్రీలంకపై), 12. సనత్ జయసూర్య (శ్రీలంక/ 2003 జనవరి 17న ఇంగ్లాండ్‌పై), 13. ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా/ 2003 మార్చి 7న శ్రీలంకపై), 14. రాహుల్ ద్రవిడ్ (్భరత్/ 2004 మార్చి 13న పాకిస్తాన్‌పై), 15. స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్/ 2004 జూలై 4న ఇంగ్లాండ్‌పై), 16. ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్/ 2004 సెప్టెంబర్ 3న భారత్‌పై), 17. క్రిస్ గేల్ (వెస్టిండీస్/ 2004 సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌పై), 18. ఇయాన్ మోర్గాన్ (ఐర్లాండ్/ 2006 ఆగస్టు 5న స్కాట్‌లాండ్‌పై), 19. సచిన్ తెండూల్కర్ (్భరత్/ 2007 జనవరి 26న దక్షిణాఫ్రికాపై), 20. సచిన్ తెండూల్కర్ (్భరత్/ 2007 ఆగస్టు 24న ఇంగ్లాండ్‌పై), 21. సచిన్ తెండూల్కర్ (్భరత్/ 2007 నవంబర్ 8న పాకిస్తాన్‌పై), 22. జెపి డుమినీ (దక్షిణాఫ్రికా/ 2011 మార్చి 15న ఐర్లాండ్‌పై), 23. తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక/2013 జూలై 11న దక్షిణాఫ్రికాపై), 24. విరాట్ కోహ్లీ (్భరత్/2013 నవంబర్ 24న వెస్టిండీస్‌పై), 25. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్/2014 మార్చి 5న వెస్టిండీస్‌పై), 26. ల్యూక్ రోన్చీ (న్యూజిలాండ్/2014 అక్టోబర్ 21న ఇంగ్లాండ్‌పై), 27. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 2015 మార్చి 12న యుఎఇపై), 28. చాము చిబాబా (జింబాబ్వే/ 2015 మార్చి 29న పాకిస్తాన్‌పై), 29. కుశాల్ పెరీరా (శ్రీలంక/ 2015 నవంబర్ 4న వెస్టిండీస్‌పై), 30. రోహిత్ శర్మ (్భరత్/2015 జనవరి 23న ఆస్ట్రేలియాపై).
వనే్డల్లో 99 పరుగులు చేసి
నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్ వీరే..
01. బ్రూస్ ఎడ్గర్ (న్యూజిలాండ్/ 1981 ఫిబ్రవరి 14న భారత్‌పై), 02. డీన్ జోన్స్ (ఆస్ట్రేలియా/ 1985 జనవరి 28న శ్రీలంకపై), 03. రిచీ రిచర్డ్‌సన్ (వెస్టిండీస్/ 1985 నవంబర్ 15న పాకిస్తాన్‌పై), 04. ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే/ 1999 అక్టోబర్ 24న ఆస్ట్రేలియాపై), 05. అలిస్టర్ క్యాంప్‌బెల్ (జింబాబ్వే/ 2000 అక్టోబర్ 1న న్యూజిలాండ్‌పై), 06. రామ్‌నరేష్ శర్వాణ్ (వెస్టిండీస్/ 2002 నవంబర్ 15న భారత్‌పై), 07. బ్రాడ్ హాగ్ (ఆస్ట్రేలియా/ 2007 ఫిబ్రవరి 4న న్యూజిలాండ్‌పై), 08. మహమ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్/ 2007 నవంబర్ 15న భారత్‌పై), 09. మైకెల్ క్లార్క్ (ఆస్ట్రేలియా/ 2010 జనవరి 30న ఇంగ్లాండ్‌పై), 10. వీరేందర్ సెవాగ్ (్భరత్/ 2010 ఆగస్టు 16న శ్రీలంకపై), 11. మాల్కం వాలెర్ (జింబాబ్వే/2011 అక్టోబర్ 25న న్యూజిలాండ్‌పై), 12. మాల్కం మెక్‌లియోడ్ (స్కాట్లాండ్/2012 జూలై 11 కెనడాపై), 13. స్వప్నిల్ పాటిల్ (యుఎఇ/2014 ఫిబ్రవరి 1న స్కాట్లాండ్‌పై).