ఆటాపోటీ

స్టార్ అట్రాక్షన్ ఫెల్ప్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లోనూ స్టార్ అట్రాక్షన్‌గా అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌నే పేర్కోవాలి. ఇప్పటికే అత్యధికంగా 18 స్వర్ణ పతకాలను సాధించిన అతను రియో ఎన్ని పతకాలు సాధిస్తాడన్నది అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్నది. వాస్తవానికి లండన్ ఒలింపిక్స్‌ను ఫెల్ప్స్‌కే అంకితం ఇవ్వాలి. బీజింగ్ ఒలింపిక్స్‌లో సంచలన విజ యాలు సాధించిన ఫెల్ప్స్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే, 200 మీటర్ల ఫ్రీస్టయల్ రిలే, 100 మీటర్ల మెడ్లే రిలే విభాగాల్లో స్వర్ణ పతకాలను, 200 మీటర్ల బటర్‌ఫ్లై, 100 మీటర్ల ఫ్రీస్టయల్ రిలే విభాగాల్లో రజత పతకాలను సాధించిన అతను మొత్తం 22 పత కాలతో తిరుగులేని రికార్డు సృష్టించాడు. ఒక ఒలింపిక్స్‌లో అత్య ధికంగా ఎనిమిది స్వర్ణ పతకాలను బీజింగ్‌లో అందుకున్న ఈ వీరుడు అత్యధిక పతకాల జాబితాలోనూ అందరి కంటే ముందున్నాడు. లండన్ నుంచి బయలుదేరే ముందు ఒలింపిక్స్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ఫెల్ప్స్ ప్రకటించడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అతను లేకపోతే 2016 ఒలింపిక్స్ బోసిపోతాయని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఈత కొలను అతని స్పర్శలేక ఉసూరుమంటుందని అనుకున్నారు. అయతే, ఆతర్వాత అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రియో ఒలింపిక్స్ కోసం ముమ్మర సాధన చేశాడు. క్వాలిఫయంగ్ ఈవెంట్స్‌ను గెల్చుకున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో సాధించిన అసాధారణ విజయాలను చూసిన అంతా అతనిని పొగడ్తల్లో ముంచెత్తారు. అజేయుడంటూ కొనియాడారు. కానీ, లండన్ ఒలింపిక్స్ 400 మీటర్ల మెడ్లేలో నాలుగో స్థానంలో నిలవగానే అతని పనయిపోయిందని విమర్శించారు. సమయానుకూలంగా మాట్లాడే వారి గురించి అతను ఏమాత్రం పట్టించుకోలేదు. లండన్‌లోనూ ఆధిపత్యం చెలాయించాడు. ఏథెన్స్ ఒలింపిక్స్ నుండి లండన్ వరకు మూడు సార్లు ప్రధానాకర్షణగా నిలిచిన అతను రియోలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఫెల్ప్స్ మాదిరిగా మూడు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన వారున్నారు. ప్రఖ్యాత డిస్కస్ త్రోయర్ అల్ అయిర్టర్ కూడా వరుసగా నాలుగు ఒలింపిక్ పతకాలు నెగ్గాడు. అయితే, ఫెల్ప్స్ మాత్రమే వరుసగా మూడు సార్లు రెండు ఈవెంట్లలో జయకేతనం ఎగరేసి కొత్త ప్రమాణాలను నిర్దేశించాడు. రియోలోనూ గెలిస్తే అతను నాలుగు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్‌గా అయర్టర్ సరసన స్థానం సంపాదిస్తాడు. ఒలింపిక్స్ ప్రారంభంలో తొలి పోటీలో (400 మీటర్ల మెడ్లే) నాలుగో స్థానంలో నిలవగానే దిగ్భ్రాంతికి గురైన తొలి ఇద్దరిలో మొదటి వ్యక్తి ఫెల్ప్స్ కాగా, రెండో వ్యక్తి ఆ పోటీ విజేత ర్యాన్ లోచెట్. తాను విజయం సాధించడంపై షాక్‌కు గురయ్యానని లోచెట్ అన్నాడు. అంతేగాకుండా, ఫెల్ప్స్ తన సామర్థ్యం మేరకు రాణించాడనీ ఇంకా అతన్నుంచి ఆశించవద్దనీ లోచెట్ అన్నాడు. ఆ వ్యాఖ్యలు ఫెల్ప్స్‌ను బాధించి ఉండవచ్చు. ఫెల్ప్స్ కూడా మనిషేనని, అతడూ పరాజయం పాలవుతాడని తొలి సారి తెలిసివచ్చింది. కానీ, వారం తిరిగేలోపు తానేంటో చేతల ద్వారానే నిరూపించాడు. అదే లోచెట్‌ను 200 మీటర్ల మెడ్లేలో మట్టికరిపించాడు. అతను ఇప్పటి వరకు 22 పతకాలు గెలుచుకోగా, వాటిలో 18 స్వర్ణాలు. రెండూ ప్రపంచ రికార్డులే.