ఆటాపోటీ

సిమోన్ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా సంచలన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ రియో ఒలింపిక్స్‌లో ఆల్‌రౌండ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి సత్తా నిరూపించుకుంది. అంతకు ముందు ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కూడా గెల్చుకుంది. అయితే, 19 ఏళ్ల సిమోన్ హఠాత్తుగా అందలం ఎక్కలేదు. జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరచడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కఠోర సాధన చేసింది. ఎంత పట్టుదల ఉన్నా ఇంటి పోరు ఆమెను నిత్యం వేధించేవి. తండ్రి రొనాల్డ్ బైల్స్, తల్లి షానన్ బైల్స్ చాలా కాలం క్రితమే విడిపోయారు. తాగుడుకు బానిసైన షానన్ సొంత పిల్లలనే పట్టించుకోలేదు. వారి సంరక్షణ బాధ్యత తనకు వద్దంటూ పక్కకు తప్పుకొంది. ఆమె నుంచి విడిపోయిన తర్వాత నెలీని రొనాల్డ్ పెళ్లి చేసుకున్నాడు. కన్నతల్లితో కలుసుకునే అవకాశం లేక, సవతి తల్లికి దగ్గర కాలేక సిమోన్ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నది. కన్నతల్లి షానన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసేందుకు వీల్లేదని తండ్రి ఆదేశం ఆమెను కట్టిపడేసింది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించినప్పటికీ సిమోన్ కళ్లు తన తల్లి కోసం ఆత్రంగా వెతికాయి. అయితే, షానన్ మాత్రం సిమోన్‌కు దూరంగానే ఉంది. సిమోన్‌ను రొనాల్డ్, అతని రెండో భార్య నెలీ అధికారికంగా దత్తత తీసుకోవడంతో ఆమెను కలిసే అవకాశాన్ని షానన్ శాశ్వతంగా కోల్పోయింది. కుటుంబ నేపథ్యం ఎలావున్నా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వాటిని అధిగమిస్తూ సిమోన్ ప్రపంచ అత్యుత్తమ జిమ్నాస్ట్‌గా ఎదగడం విశేషం. నేటి యువతకు ఆమె జీవితం మార్గదర్శకంగా నిలుస్తుంది.

చిత్రం... పట్టుదలకు మారుపేరు
అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్