ఆటాపోటీ

ఎవడైతే మాకేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ అధికారుల తీరు విచిత్రంగా ఉంది. ఎవరైతే మాకేంటి? అన్న రీతిలో వ్యవహరిస్తూ విమర్శలకు గురవుతున్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగితే, అందులో ఎనిమిదేళ్ల ‘సాంబా’ డాన్సర్ తవాన్ లుకాస్ డి ట్రిండేడ్ తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాడు. మ్యూజిక్ స్టార్ విల్సన్ డస్ నెవెస్ సైతం ఆ పిల్లవాడి సామర్థ్యాన్ని గుర్తించి, అతనితో కలిసి స్టెప్పులు వేశాడు. ట్రిండేడ్‌కు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికే కొత్త అందాలను దిద్దిన ట్రిండేడ్‌ను అధికారులు పూర్తిగా విస్మరించారు. ఒలింపిక్ క్రీడలను తిలకించేందుకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. రియో డి జెనీరోలోని మురికివాడకు చెందిన ఆ చిన్నారి ఎంతో కష్టపడి సాంబా నృత్యాన్ని నేర్చుకున్నాడు. కఠోర సాధన చేశాడు. అందరి మన్ననలు అందుకున్నాడు. కానీ, అధికారులు మాత్రం అతడిని పట్టించుకున్న పాపాన పోలేదు. టికెట్ కొనే స్తోమత లేక, అధికారుల నుంచి టికెట్లు సంపాదించుకోలేక ట్రిండేడ్ నీరసపడిపోయాడు.
భద్రత డొల్ల!
ఒలింపిక్స్ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని బ్రెజిల్ సర్కారు ఎన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా పాత్రికేయులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడం భద్రతపై అనుమానాలను పెంచుతున్నది. ఆర్థికంగా దివాలా స్థితిలో ఉన్న బ్రెజిల్‌లో ఒలింపిక్స్ జరగడాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం నిరసనలతో రియో నగరాన్ని హోరెత్తిస్తున్నది. ఈ నిరసనకారులే బస్సుపై దాడికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా ఈ కోణంలోనే దర్యాప్తు ఆరంభించారు.