ఆటాపోటీ

అమెరికా X రష్యా డోప్‌వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, రష్యా దేశాల మధ్య నెలకొన్న క్రీడాస్పర్థ అవాంఛిత రూపాన్ని సంతరించు కుంటున్నది. రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందంటూ అమెరికా నానాయాగీ చేసింది. అయతే, అమెరికా ఉద్దేశపూర్వకంగా కొంత మందికి డోప్ పరీక్షల నుంచి పరోక్షంగా మినహాయంపును సంపాదిస్తున్నదని ఆరోపించిన రష్యా హ్యాకర్లు తమ వాదనను నిరూపించడానికి సెరెనా, వీనస్, సిమోనె బైల్స్, ఎలెనా డెల్లీ డోన్ ఫైల్స్‌లోని సమాచారాన్ని బయట పెట్టి ఎదురు దెబ్బ తీస్తున్నారు.

క్రీడా రంగంలో అమెరికా, రష్యా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. రష్యాను వ్యూహాత్మక డోప్ దోషిగా ప్రపంచం ముందు నిలబెట్టడంలో అమెరికా సఫలమైంది. అయితే, అమెరికా నీతి బాహ్యమైన చర్యలను అనుసరిస్తున్నదంటూ రష్యా ఎదురుదాడికి దిగింది. ప్రత్యక్షంగా అమెరికాతో తల పడకపోయనా, హ్యాకర్ల సాయంతో పరోక్ష పోరాటానికి తెరతీసింది. నలుగురు అమెరికా స్టార్లకు డోప్ పరీక్షల నుంచి వెసులుబాటు కల్పించేందుకు వీలుగా వివిధ రకాల మందులను వాడేందుకు అనుమతించడాన్ని రష్యా హ్యాకర్లు సాక్ష్యాధారాలతోసహా నిరూపించారు. వీరిలో టెన్నిస్ క్రీడాకారిణులు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ పేర్లు ఉండడంతో హ్యాక్ ఉదంతం ప్రాధాన్యతను సంతరించుకుంది. రియో ఒలింపిక్స్‌లో సంచలనాలు సృష్టించిన జిమ్నాస్ట్ సిమోనె బైల్స్, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ఎలెనా డెల్లీ డోన్ కూడా హ్యాకర్లు బయటపెట్టిన జాబితాలో ఉన్నారు. నలుగురు పేరుమోసిన మహిళలకు సంబంధించిన రహస్య వివరాలను బట్టబయలు చేసినందుకు రష్యాపై అమెరికా ఆగ్రహంతో ఉంది. రియో ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడే స్థాయికి తమ ప్రతిష్ఠను దిగజార్చిన అమెరికా పట్ల రష్యా కోపంతో రగులుతున్నది. ఈ దేశాల ఆధిపత్య పోరాటానికి డోప్ పరీక్షలు, ఫలితాలే వేదిక కావడం సమస్య తీవ్రతను పెంచుతున్నది. తమ వెబ్‌సైట్లను హ్యాక్ చేసి, అందులో నిక్షిప్తంమైన సమాచారాన్ని బట్టబయలు చేయడం అనాగరిక చర్య అంటూ అమెరికా మండిపడుతున్నది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానిస్తున్నది. వ్యూహాత్మక డోపింగ్‌కు తాము పాల్పనట్టు అమెరికా ప్రపంచాన్ని నమ్మించిందని రష్యా వాదన. క్రీడా మైదానాల్లో ఎదుర్కొనే శక్తిలేక, అమెరికా అడ్డదారులను అనే్వషిస్తున్నదని, అందులో భాగంగానే ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా)తో కలిసి కుట్ర చేసిందని రష్యా ఆరోపణ. మొత్తానికి రెండు దేశాల మధ్య చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు క్రీడా రంగంలో పెను మార్పులకు కారణం కానున్నాయి.
వాడా నివేదికతో సంచలనం
రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందంటూ వాడా బహిర్గతం చేసిన నివేదిక సంచలనానికి కారణమైంది. రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన వారిలో ఏకంగా 117 మంది అథ్లెట్లు డోపింగ్ పరీక్షలో పట్టుబడడం రష్యాపై వచ్చిన ఆరోపణలకు బలాన్నిస్తున్నది. ఒకరి తర్వాత మరొకరిగా డోప్ దోషులు పుట్టుకురావడం రష్యాలో క్రీడా రంగం మొత్తం మాదక ద్రవ్యాల మత్తులో జోరుగుతున్నదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఒలింపిక్స్ లేదా ప్రపంచ చాంపియన్‌షిప్స్... పోటీలు ఏవైనా పతకాలు కొల్లగొట్టాలని ప్రతి దేశం ఆశపడుతుంది. అందుకు అనుగుణంగానే అథ్లెట్లకు అన్ని విధాలా సహాయసహకారాలు అందచేస్తుంది. అయితే, పతకాలను సాధించడానికి వీలుగా అథ్లెట్లతో రష్యా ప్రభుత్వమే నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగింప చేసిందని వాడా ఆధ్వర్యంలోని కమిటీ ప్రకటించడం ప్రకంపనలకు కారణమైంది. ఇప్పటి వరకూ అథ్లెట్లు అడ్డదారులు తొక్కడమే అందరికీ తెలిసిన విషయం. ఒక దేశ సర్కారే ఈ వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతుందన్నది సరికొత్త విషయం. అందుకే, క్రీడా ప్రపంచాన్ని వాడా కమిటీ నివేదిక ఒక సుమామీ మాదిరి అతలాకుతలం చేసింది. ఈ నివేదికలో నిజానిజాలు ఎలావున్నా, ఉత్ప్రేరకాలను వాడి గెలవడం వల్ల క్రీడా రంగం పూర్తిగా నిర్వీర్యమవుతుందనన్నది వాస్తవం. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఉపయోగించే ఉత్ప్రేరకాలు (స్టెరాయిడ్స్) క్రీడా రంగానికి శాపంగా మారాయి. అథ్లెట్లు మాదక ద్రవ్యాలను వాడడం ఒక ఎత్తయితే, ప్రభుత్వమే బలవంతంగా వారితో డోప్ తప్పులు చేయడం మరో ఎత్తు. ఉత్ప్రేరకాలు వాడడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు లభించవచ్చుగానీ, దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ కష్టపడకుండానే అందలం ఎక్కడం సాధ్యమవుతుందిగానీ దాని వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. పైగా, అడ్డదారిలో అందలం ఎక్కడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. డోపింగ్ చీడ సోకిన క్రీడా రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ అంశాన్ని పక్కకుపెట్టి అమెరికా, రష్యా పరస్పర ఆరోపణలతో వీధికెక్కడంలో ఔచిత్యం ఏమిటో అంతుచిక్కడం లేదు.
ఎదురుదాడి
తమను క్రీడల్లో అణగదొక్కడానికి అమెరికా కుట్రలు పన్నుతున్నదని ఆరోపిస్తున్న రష్యా ఎదురుదాడికి దిగింది. జార్ టీం లేదా ఫాన్సీ బేర్స్‌గా పేర్కొనే రష్యా హ్యాకర్ల బృందం అమెరికా డోపింగ్ నిరోధక పాలన, నిర్వాహణ (ఆడమ్స్) వెబ్‌సైట్లలోకి చొచ్చుకుపోయింది. నలుగురు క్రీడాకారిణులకు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు ఏ విధంగా అనుకూలంకా వ్యవహరించాయో ధ్రువ పత్రాలతోసహా బయటపెట్టాయి. వివిధ కారణాలను పేర్కొంటూ సెరెనా, వీనస్, బైల్స్, డోన్ కొన్ని మందులు వాడారు. వాటిలో నిషిద్ధ మాదక ద్రవ్యాలుగల ఔషధాలు కూడా ఉన్నాయి. జలుబు, దగ్గు వంటి సామాన్య రుగ్మతలకు వాడే మందల్లోనూ నిషిద్ధ ద్రవ్యాలున్నాయని పేర్కొనే వాడా ఈ నలుగురికీ ఎందుకు మినహాయింపు ఇచ్చిందని ‘ఆడమ్స్’ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన బృందం నిలదీస్తున్నది. ఒకరు చేస్తే తప్పు, మరొకరు చేస్తే ఒప్పా అని ప్రశ్నిస్తున్నది. పొరపాటున వాడిన మందుల్లో నిషిద్ధ సబ్‌స్టెన్స్ ఉన్నాయని పేర్కొంటూ నిషేధం వేటు వేసే అంతర్జాతీయ సమాఖ్యలు అమెరికా క్రీడాకారిణుల పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరించారని ఫ్యాన్సీ బేర్స్ అడుగుతున్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సహేతుకమై న సమాధానం లేదు.
ఆ నివేదికే ప్రామాణికమా?
క్రీడల్లో వేళ్లూనుకుంటున్న డోపింగ్ సమస్యకు, రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందనడానికి వాడా కమిటీ ఇచ్చిన నివేదికే ప్రామాణికమా? అందులోని అంశాలన్నీ నిజమేనా? దశాబ్దాల తరబడి రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతుంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)సహా క్రీడా సమాఖ్యలన్నీ ఏం చేస్తున్నాయి? చివరికి వాడానే అప్పట్లో ఎందుకు ఈ ఉదంతాన్ని బయటపెట్టలేకపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం అనుకున్నంత సులభం కాదు. అది తేలితేగానీ రష్యాను దోషిగా నిరూపించడం సాధ్యం కాదు. ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా రష్యాను అడ్డుకోవడానికి చివరి క్షణం వరకూ ప్రయత్నం జరిగి ఉండవచ్చు. ఆ దేశానికి చెందిన ఎంతోమంది క్రీడాకారులు డోపింగ్ పరీక్షల్లో విఫలమవుతున్నారంటూ తాజా నివేదికలను ప్రకటిస్తూ, వారు సంపాదించిన పతకాలను రద్దు చేస్తుండవచ్చు. కానీ, వాడా, ఐఒసి రష్యన్లను లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నాయన్న వాదన ఇప్పటికే బలపడుతున్నది. నలుగురు అమెరికా మేటి స్టార్ల డోప్ పరీక్షల వివరాలను రష్యా హ్యాకర్లు వెల్లడించడంతో అమెరికా కుట్ర కోణం కూడా బయటపడే అవకాశాలున్నాయి.
కమిటీ ఏం చెప్పింది?
వాడా నియమించిన స్వతంత్ర కమిటీ రెండు విడతలుగా సమర్పించిన నివేదికల్లో పలు సంచలన విషయాలను వెల్లడించింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించడానికి రష్యా ప్రభుత్వం అథ్లెట్లకు నిషిద్ధ మాదక ద్రవ్యాలను నయానో భయానో ఇచ్చిందని ఈ కమిటీ ఆరోపించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రకటించింది. ప్రభుత్వమే ఈ విధంగా అథ్లెట్లను డోప్ దోషులు మార్చిందన్న వార్త సహజంగానే క్రీడా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఆరోపణే నిజమైతే, రష్యా అనైతిక విధానాలకు అంతర్జాతీయ అమెచూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్), ఐఒసిసహా పలు క్రీడా సమాఖ్యలకు కూడా ఈ పాపంలో వాటా ఉండే ఉంటుంది. క్రీడల్లో డోపింగ్ కొత్తకాకపోయినా, ప్రభుత్వం, జాతీయ క్రీడా సమాఖ్యలు ఏకమై అథ్లెట్లకు మాదక ద్రవ్యాలను అలవాటు చేయడం మాత్రం ఎవరూ ఊహించని పరిణామం. జయాపజయాలను సమానంగా స్వీకరించాలన్నది క్రీడల ప్రధాన సూత్రం. విజయాలకు దగ్గర మార్గాలను ఎంచుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందంటే, ఇన్నాళ్లూ వాడా ఎందుకు పెదవి విప్పలేదన్నది మొదటి ప్రశ్న. రియో ఒలింపిక్స్‌కు ముందే హడావుడిగా దీనిపై హడావుడి చేసిందనేది రెండో ప్రశ్న. ఒలింపిక్స్‌లో రష్యా దూకుడుకు కళ్లెం వేసి, ఎక్కువ పతకాలు సాధించాలన్న అమెరికా కుట్ర చేసిందన్న విమర్శలు లేకపోలేదు. నిజానిజాలు బయటప డతాయని కోరుకుందాం.

- సాయ మురుకుట్ల