ఆటాపోటీ

సూపర్ స్టార్ అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేస్తే, ఆ రెండు జట్లతోపాటు ఆస్ట్రేలియాపైనా పంజా విసిరిన సూపర్ స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ను అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో 200 వికెట్ల మైలుయిని చేరాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ముగిసే సమయానికి అతని ఖాతాలో 275 వికెట్లు ఉన్నాయి. కివీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో అశ్విన్ ఏ విధంగా రాణించాడో చెప్పడానికి ఈ వికెట్లే నిదర్శనం.

ఉమేష్ బెటర్
ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే, మిగతా వారి కంటే ఉమేష్ యాదవ్ మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. రెండు జట్ల ఫాస్ట్ బౌలర్లు 22 చొప్పున వికెట్లు పడగొట్టారు. భారత పేసర్లు సగటున 30.68 పరుగులు సమర్పించుకుంటే, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల సగటు 31.54 పరుగులు. ఉమేష్ ఈ సీజన్‌లో ఒక్కో వికెట్‌కు 23.41 పరుగులిచ్చి, మొత్తం 17 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లలో ఎవరూ సగటున 30 కంటే తక్కువ పరుగులు ఇవ్వలేదు.
స్పిన్నర్లలో ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను సగటున 25.26 పరుగులివ్వగా, భారత స్టాన్ స్పిన్నర్ అశ్విన్ 27.38 పరుగులిచ్చాడు. అయితే, అన్ని టెస్టుల రెండో ఇన్నింగ్స్‌లో లియాన్ కంటే అశ్విన్ బౌలింగ్ మెరుగ్గా ఉంది. మొత్తం మీద రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 14 వికెట్లు సాధిస్తే, లియాన్ కేవలం నాలుగు వికెట్లు కూల్చగలిగాడు. కాగా, ఇరు జట్ల స్పిన్నర్ల గణాంకాలను పరిశీలిస్తే, రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడని చెప్పాలి. అతను 18.56 సగటుతో 25 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో జడేజాకే ఎక్కువ వికెట్లు లభించాయి. అశ్విన్ 21 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ ఒకీఫ్, నాథన్ లియాన్ చెరి 19 వికెట్లు పడగొట్టి మూడో స్థానాన్ని ఆక్రమించగా, ఉమేష్ యాదవ్‌కు 17 వికెట్లు దక్కాయి.