ఆటాపోటీ

అథ్లెటిక్స్‌కు మంచి రోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్లు పతకాలు కొల్లగొట్టడంలో విఫలమవుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే ప్రమాణాలు పెరిగాయని చెప్పవచ్చు. ఇప్పటికే 15 మంది అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. మరికొన్ని ఈవెంట్స్ జరగాల్సి ఉన్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అథ్లెటిక్స్‌లో ఇప్పటి వరకూ పతకం సాధించలేకపోయిన భారత్ రియోలో అద్భుతాలు సృష్టిస్తుందని అనుకోవడం అత్యాశే. కానీ, ప్రమాణాలను పెంచుకొని, గట్టిపోటీనివ్వగలిగే స్థాయికి చేరుకోవడం ఆశాజనకమైన పరిణామమే.