క్రైమ్/లీగల్

కదిరిలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, సెప్టెంబర్ 5: పట్టణంలోని కాలేజి రోడ్డులో ప్రధాన రహదారిపై వున్న మహమ్మద్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున దొంగలుపడి 46 తులాల బంగారు, 50 తులాల వెండి, రూ. 3.10 లక్షలు నగదును దోచుకెళ్లారు. బాధితుడు మహమ్మద్ తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనుకవైపున మెష్‌ను తొలగించి ఇంట్లోకి చొరబడి బీరువాలో వున్న బంగారు, నగదును దోచుకెళ్లారన్నారు. సాధారణంగా తెల్లవారుజామున 4 గంటలకే తాను నిద్ర లేచి హోటల్‌కు సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేసే వాడినని, దొంగలు తనతోపాటు నిద్రిస్తున్న భార్య, కుమారుడిపై మత్తు మందు చల్లారన్న అనుమానం వ్యక్తం చేస్తూ నిద్రలేవడానికి ఇబ్బందిపడ్డామన్నారు. 4.30 గంటలకు నిద్రలేచి చూసే సరికి బీరువాను పగులగొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి, రూరల్ సీఐ మన్సూరుద్దీన్, పట్టణ ఎస్‌ఐలు హేమంత్ కుమార్, ఖాజా హుస్సేన్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆరా తీశారు. అనంతపురం నుండి జాగిలాలను తెప్పించడంతోపాటు క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హెచ్‌ఎల్‌సి కాలవలోకొట్టుకుపోయిన విద్యార్థి
డీ.హీరేహాల్, సెప్టెంబర్ 5: డీ.హీరేహాల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (17) అనే విద్యార్థి బుధవారం బళ్లారి సమీపంలోని హెచ్‌ఎల్‌సి కాలవలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు బంధువులు తెలిపారు. శ్రీకాంత్ బళ్లారి పట్టణంలోని వాడ్ల జూనియర్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. బుధవారం తన స్నేహితులతో కలసి హోస్పేట రోడ్డులోని హెచ్‌ఎల్‌సి కాలవ వద్దకు వెళ్లినట్లు తెలిపారు. స్నానాలు చేసేందుకు 5 మంది విద్యార్థులు కాలవలోకి దిగారన్నారు. అప్పటికే పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహానికి విద్యార్థి కొట్టుకుపోయాడు. స్నేహితులు కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ కనబడలేదని తోటి స్నేహితులు తెలిపారు. సాయంత్రానికి కూడా శ్రీకాంత్ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకోవడానికి హెచ్‌ఎల్‌సి కాలవ వెంట పోలీసులు ప్రయత్నిస్తునే ఉన్నారు. వరాలు తెలియాల్సి ఉంది.