అనంతపురం

ముఖ్యమంత్రి నిరుద్యోగులను మోసం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని నిరుద్యోగులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని రాష్ట్ర బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బీజైవైఎం ధర్నా చేశారు. నిరుద్యోగులకు సీఎం మోసం చేసినందుకు నిరసనగా బీజైవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని ప్రయత్నించిన బీజైవైఎం నాయకులను ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అరెస్టు చేశారు. దీంతో బీజైవైఎం నాయకులు అక్కడే నిరసన ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు బీజైవైఎం నాయకులను అరెస్టు చేసి టుటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రమేష్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలు అమలుచేయడంలో తీవ్రంగా వైఫల్యం చెందారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటికి నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేవలం వేలల్లో నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతకు భృతి 2 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 18 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దారుణమన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రానికి వెళ్లి గేట్‌కీపర్లుగా జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్‌లో 150 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి 5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వారు కట్టే ఫీజుతోనే వారికి జీతాలు ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తున్నారని ఆరోపించారు.

25న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయనున్న ఫుడ్ కమిషన్
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22: జిల్లాలోని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ నెల 25వ తేదీన ఏపీ ఫుడ్ కమిషన్ తనిఖీ చేయనున్నదని జిల్లా విద్యా శాఖాధికారి జనార్థనాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. 25న అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ పాటించి, సక్రమంగా పర్యవేక్షించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అలాగే ఈ నెల 26వ తేదీన ఎంఈఓలకు, ప్రధానోపాధ్యాయులకు కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నామని, సమావేశానికి అందరు హాజరుకావాలని తెలిపారు.